మందుబాబుతో యాంకర్ రవి కష్టాలు.. కానీ బాగుందట!

బుల్లితెర యాంకర్ రవి పరిచయం గురించి తెలీనోలే లేరు.ఎన్నో షోల్లో యాంకరింగ్ చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

 Anchor Ravi Instagram Post Goes Viral About Drunken Man , Anchor Ravi, Instagram-TeluguStop.com

బిగ్ బాస్ బ్యూటీస్ లాస్య, శ్రీముఖి లతో కలసి యాంకరింగ్ చేస్తూ అభిమానులతో మరింత దగ్గరయ్యాడు.ఇక సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటాడు రవి.ఎప్పటికప్పుడు తన షోల గురించి, వ్యక్తిగత విషయాల గురించి బాగా పంచుకుంటాడు.ఇదిలా ఉంటే తాజాగా ఓ మందుబాబు తో కష్టాలు పడ్డాడు రవి.

మందు బాబు తో కష్టాలు అంటే అది ఏ షో లలో చేసిన స్కిట్ మాత్రం కాదు.హైదరాబాదులో తాను ఎదుర్కొన్న ఓ ఘటన.రవి తన కార్ లో ప్రయాణిస్తున్న సమయంలో హైదరాబాద్ లో కావూరి హిల్స్ ప్రాంతంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి భాగం మందు తాగి రోడ్డు మీద వస్తున్న వాహనాలను అడ్డుకుంటూ అలా కాసేపు హల్ చల్ సృష్టించడంతో.యాంకర్ రవి కూడా ఆ ఘటనను ఎదుర్కొన్నాడట‌.

ఇక కారులో ఉన్న యాంకర్ రవి ఏమి చేయలేక అలాగే కాసేపు ఫోన్ లో మందుబాబు వీడియోను షూట్ చేశాడట.ఇక ఆ తర్వాత సర్దార్ గబ్బర్ సింగ్ లోని ఆడెవడన్నా వీడెవడన్నా సర్దార్ అన్నకు అడ్డు ఎవడు అనే సాంగ్ తో రీమిక్స్ కొట్టి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు.ఇక ఈ వీడియో కి ఒక కామెంట్ కూడా పెట్టాడు రవి.మంచి చెడు చెబుదామంటే మొహానికి మాస్క్ లేదు, మైండ్ హాష్ లో లేదు.కానీ ఇంత దారుణమైన పరిస్థితుల్లో కూడా అతని ముఖంలో చిరునవ్వు చూస్తే ఎక్కడో కాస్త ఆనందంగా ఉందని.అవును నిజమే మన ఆనందాన్ని మనం మాత్రమే వెతుక్కోవాలి అంటూ షేర్ చేశాడు రవి.అంతే కాకుండా అతని దేవుడు సేఫ్ గా ఉండాలని కోరుకుంటూ కామెంట్ కూడా చేశాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube