యాంకర్ రవిని అడ్డంగా ముంచేసిన ఫ్రెండ్  

Anchor Ravi Betrayed By His Friend-anchor Ravi,etv,pataas,sreemukhi,telugu Anchor Ravi,telugu Movie News

తెలుగు బుల్లితెరపై యాంకర్లుగా తమకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను సొంతం చేసుకున్న వారిలో యాంకర్ రవి కూడా ఒకరు.తనదైన ఎనర్జీతో యూత్‌ను బాగా ఆకట్టుకున్న యాంకర్‌గా రవికి మంచి గుర్తింపు ఉంది.

Anchor Ravi Betrayed By His Friend-anchor Ravi,etv,pataas,sreemukhi,telugu Anchor Ravi,telugu Movie News Telugu Tollywood Movie Cinema Film Latest News-Anchor Ravi Betrayed By His Friend-Anchor Etv Pataas Sreemukhi Telugu Telugu Movie News

రవి చేతినిండా షోలు వస్తున్నా, పటాస్ లాంటి సూపర్ షో కోసం వాటిని పక్కకు బెట్టాడు.ఈ క్రమంలో పటాస్ సూపర్ హిట్‌గా నిలవడంలో రవి పాత్ర ఎలాంటి అందరికీ తెలిసిందే.

అయితే ఇప్పుడు రవి పటాస్ నుండి తప్పుకున్నాడనే వార్త అందరికా తెలిసిందే.లేడీ యాంకర్ శ్రీముఖి బిగ్‌బాస్ రియాల్టీ షోకు వెళ్లడం, అటుపై ఆమె స్థానంలో వర్షిణిని తీసుకున్నారు.

అయితే తాజాగా ఈ షో నుండి రవి తప్పుకున్నాడు.కాగా శ్రీముఖితో రవి గొడవల కారణంగా అతడు తప్పుకున్నాడంటూ ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే ఆ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని రవి స్పష్టం చేశాడు.రోజూ టీవీలో కనిపించేకంటే, వారానికి రెండుసార్లు విభిన్నమైన కాన్సెప్ట్‌తో కనిపిస్తే చాలని రవి పటాస్ నుండి తప్పుకున్నాడట.

ఇక తనను ఓ స్నేహితుడు నమ్మించి మోసం చేసినట్లు కూడా రవి చెప్పుకొచ్చాడు.తనతో పాటు రెండేళ్లు కలిసి ఉన్న ఓ స్నేహితుడు రవిని నమ్మించి మోసం చేశాడట.ఏకంగా రూ.45 లక్షలు కాజేయడంతో రవికి దిమ్మతిరిగిందని చెప్పుకొచ్చాడు.

కానీ అతడిని ఏమీ చేయలేకపోయినందుకు రవి చాలా బాధపడినట్లు చెప్పుకొచ్చాడు.కాగా త్వరలో తన నిర్మాణంలో ఓ సరికొత్త షోను ప్లాన్ చేస్తున్నట్లు యాంకర్ రవి చెప్పుకొచ్చాడు.

తాజా వార్తలు