వర్షిణిని ఏడిపించిన యాంకర్ రవి.. బోడిదాన అంటూ..?

బుల్లితెరపై చేసింది తక్కువ షోలే అయినా యాంకర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది వర్షిణి.అడపాదడపా సినిమాల్లో నటించినా వర్షిణికి సినిమాల కంటే టీవీ షోలే ఎక్కువగా మంచి పేరు తెచ్చిపెట్టాయి.

 Anchor Ravi Fun With Anchor Varshini In Talk Show-TeluguStop.com

గతంలో పటాస్ షోలో రవితో కలిసి యాంకర్ గా చేసిన వర్షిణి ప్రస్తుతం ఢీ ఛాంపియన్స్ షోలో యాంకర్ గా ఉన్నారు.పటాస్ షో ద్వారా కుదిరిన పరిచయం వల్ల వర్షిణికి రవితో స్నేహబంధం ఉంది.

కొన్ని రోజుల క్రితం రవి వర్షిణి, ఆమె అక్క సౌజన్యను ఇంటర్వ్యూ చేయగా వర్షిణి అక్క సౌజన్య ఆమె గురించి ప్రేక్షకులకు ఎన్నో తెలియని విషయాలను చెప్పారు.వర్షిణిని తన బావ బోడిదాన అని పిలుస్తాడని అలా పిలిస్తే వర్షిణికి చాలా కోపం వస్తుందని సౌజన్య చెప్పారు.

 Anchor Ravi Fun With Anchor Varshini In Talk Show-వర్షిణిని ఏడిపించిన యాంకర్ రవి.. బోడిదాన అంటూ..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

వర్షిణి తనను ఎవ్వరూ అలా పిలవరని బావ మాత్రం రావే బోడిదాన అంటూ తెగ ఏడిపిస్తూ ఉంటాడని చెప్పుకొచ్చారు.అయితే బావ సరదాగానే అలా పిలుస్తాడని వర్షిణి అన్నారు.

Telugu Anchor Ravi, Fun With Varshini, Talk Show, Varshini Secrets-Movie

వర్షిణి సోదరి ద్వారా రహస్యాలను బయటపెట్టించిన రవి వర్షిణిని బోడిదాన అంటూ ఏడిపించారు.వర్షిణి తనకు అలా పిలిస్తే నచ్చదంటూ చెప్పుకొచ్చింది.మొదట పటాస్ షోకు రవి, శ్రీముఖి యాంకర్లుగా వ్యవహరించారు.బిగ్ బాస్ సీజన్ 3లో ఛాన్స్ రావడం, బిగ్ బాస్ నిర్వాహకులు భారీ రెమ్యునరేషన్ ను ఆఫర్ చేయడంతో శ్రీముఖి పటాస్ షో కు బిగ్ బాస్ షోలో పాల్గొనటానికి కొన్ని రోజుల ముందే గుడ్ బై చెప్పింది.

ఆ సమయంలో వర్షిణి పటాస్ షోకు యాంకర్ గా ఎంట్రీ ఇవ్వగా రవి వర్షిణి మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది.అయితే ఆ తరువాత కొన్ని కారణాల వల్ల రవి కూడా పటాస్ షోకు దూరం కావడం ఆ షో ఆగిపోవడం జరిగింది.

వర్షిణికి కూడా మంచి పేరు, గుర్తింపు రావడానికి ఒక రకంగా పటాస్ షోనే కారణమైంది.

#Talk Show #Anchor Ravi

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు