ట్రోల్స్ పై ఫైర్ అయిన యాంకర్ రవి.. చెత్త డాష్‌గాళ్లపై లీగల్ యాక్షన్ అంటూ సీరియస్!

Anchor Ravi Fired On Trolls And Said I Will Take Legal Action Against Tham

బిగ్ బాస్ సీజన్ ఫైవ్ చూస్తుండగానే మరో రెండు వారాల్లో పూర్తి కానుంది.ఈ క్రమంలోనే బిగ్ బాస్ 12వ వారంలో భాగంగా ఎవరూ ఊహించని విధంగా హౌస్ లో టైటిల్ రేసులో ఉంటారు అనుకున్నా కంటెస్టెంట్ యాంకర్ రవి బయటకు రావడంతో ఇప్పటికీ కూడా ఆయన అభిమానులు ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.

 Anchor Ravi Fired On Trolls And Said I Will Take Legal Action Against Tham-TeluguStop.com

యాంకర్ రవి కూడా తన ఎలిమినేషన్ వెనుక ఏదో కుట్ర జరిగిందని ప్రతి ఒక్క విషయాన్ని తాను బయటపెడతానని శపతం చేస్తున్నాడు.ఇలా బిగ్ బాస్ హౌస్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనుకున్నటువంటి రవి బయటకు రావడంతో పెద్దఎత్తున బిగ్ బాస్ కి వ్యతిరేకంగా నిరసనలు చేశారు.

బిగ్ బాస్ హౌస్ లో ఉన్నటువంటి కంటెస్టెంట్ లో రవి ఎంతో స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఈయనకు తక్కువ ఓట్లు పడ్డాయని బిగ్ బాస్ అర్థం లేని కారణాలు చెబుతున్నట్టు వాదనలు చేశారు.రవి కన్నా హౌస్ లో ఉన్నటువంటి ప్రియాంక కాజల్ కి బయట పెద్దగా ఫ్యాన్ ఫాలోయింగ్ లేదని వారికి ఎక్కువ ఓట్లు పడి రవికి తక్కువ పడటం ఏంటి అంటూ ప్రశ్నించారు.

 Anchor Ravi Fired On Trolls And Said I Will Take Legal Action Against Tham-ట్రోల్స్ పై ఫైర్ అయిన యాంకర్ రవి.. చెత్త డాష్‌గాళ్లపై లీగల్ యాక్షన్ అంటూ సీరియస్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇక బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళిన ప్రతి ఒక్కరు కంటెస్టెంట్ బయట వారి గురించి ప్రమోట్ చేయమని పిఆర్ టీమ్ ను ఉంచి వెళ్తారు.అయితే రవి కూడా తన గురించి ప్రమోషన్ చేయమని చెప్పి వెళ్లారు అయితే కేవలం హౌస్ లో ఉన్న కంటెస్టెంట్ లగురించి మాత్రమే మాట్లాడాలని వారి కుటుంబ సభ్యుల గురించి మాట్లాడకూడదు అని ముందుగానే హెచ్చరించారు.

Telugu Anchor Ravi, Big Boss, Biggboss, Cyber, Tollywod, Trolls-Movie

ఈ సమయంలోనే బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళిన తర్వాత కొందరు వారి అభిమాన కంటెస్టెంట్ పై ఉన్న అభిమానంతో పక్కవారిని నెగిటివిటీగా చూపించడం వల్ల వారి క్యారెక్టర్ బ్యాడ్ అవుతుంది.అచ్చం రవి విషయంలో ఇదే జరిగింది.ఎంతోమంది సోషల్ మీడియా వేదికగా ఫేక్ అకౌంట్లు సృష్టించి కేవలం రవి గురించి మాత్రమే కాకుండా తన భార్య గురించి కూడా చెడుగా ప్రచారం చేశారు.అలాగే తన కూతురు వియాను కూడా సోషల్ మీడియా వేదికగా పెద్దఎత్తున ట్రోలింగ్ చేశారు.

ఈ విషయంపై రవి భార్య నిత్య తన సన్నిహితుల దగ్గర మాట్లాడుతూ ఆవేదన వ్యక్తం చేశారు.

బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చిన తర్వాత రవి తన గురించి జరిగిన చెడు ప్రచారం గురించి తెలుసుకుని రవి ఎంతో ఆగ్రహం వ్యక్తం చేశారు.ఎవరైనా సరిగా చేయకపోతే వారికి సరిగ్గా చేయలేదు నచ్చలేదు అని వారి గురించి మాట్లాడాలని ఇలా ఫ్యామిలీ గురించి మాట్లాడటం ఏంటి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ క్రమంలోనే ఇలాంటి వార్తలకు పుల్ స్టాప్ పెట్టాలని రవి ఏకంగా సైబర్ క్రైమ్ హెల్ప్ తీసుకొని ఇలాంటి వాటికి చెక్ పెట్టబోతున్నట్లు ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు.

కేవలం నా ఫ్యామిలీ అని మాత్రమే కాకుండా ఎవరి ఫ్యామిలీ వరకు కూడా ఇలాంటి కామెంట్స్ వెళ్ళకూడదు వెళ్తే ఏమవుతుందో తెలియ చెప్పాలి అంటూ ఈ విషయంపై ఎంతో సీరియస్ అయినట్లు తెలుస్తోంది.

ఇటువంటి నెగిటివిటీని ప్రచారం చేసే వారి గురించి లీగల్ గా యాక్షన్ తీసుకోవడమే కాకుండా ఇలాంటి చెత్త నా డ్యాష్ గాళ్లు ఉన్నారని ప్రజలకు అర్థం అవ్వాలి అంటూ రవి ఈ విషయంపై ఎంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.మనకు సంబంధించిన విషయంలో మనల్ని కాకుండా మన ఫ్యామిలీని ఇన్వాల్వ్ చేస్తూ ఇలా ట్రోల్ చేయడంవల్ల ఎలాంటి నొప్పి ఉంటుందో అది కేవలం అనుభవించే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది.అందుకే సైబర్ క్రైమ్ కి వెళ్లి లీగల్ గా యాక్షన్ తీసుకొని అలాంటి వారికి బుద్ధి వచ్చే విధంగా చేస్తానని ఈ సందర్భంగా రవి ట్రోల్స్ విషయం పై అవుతున్నారు.

#Anchor Ravi #Biggboss #BiggBoss #Tollywod #Trolls

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube