డిస్ట్రిబ్యూటర్ మోసం చేశాడంటూ కేసు నమోదు చేసిన ప్రముఖ యాంకర్

ఈ మధ్య కాలం లో యాంకర్ లు కూడా సినిమాల్లో నటిస్తుండడం కామన్ అయిపోయిన విషయం తెలిసిందే.పటాస్ షో తో మంచి పేరు సంపాదించిన యాంకర్ రవి కూడా ఇటీవల ఒక సినిమా తో హీరోగా మారిపోయాడు.

 Anchor Ravi Filed A Case Against Distributor Sandeep-TeluguStop.com

ఈ క్రమంలో సందీప్ అనే డిస్ట్రిబ్యూటర్ కి కొంత డబ్బు ఇచ్చానని అది తీసుకొని అతడు నన్ను మోసం చేసాడు అంటూ హైదరాబాద్ లోని కూకట్ పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.వివరాల్లోకి వెళితే… యాంకర్ రవి హీరో గా నటించిన ఇది మా ప్రేమ కథ సినిమా కు సందీప్ అనే వ్యక్తి డిస్ట్రిబ్యూటర్ గా ఉన్నాడు.

అయితే ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద చతికల పడిన సంగతి తెలిసిందే.అయితే ఈ చిత్రం విషయంలో డిస్ట్రిబ్యూటర్ సందీప్ రూ.41 లక్షలు తీసుకొని తనను మోసం చేశాడు అంటూ పోలీసులను ఆశ్రయించాడు.అయితే 2018 అక్టోబర్ లో సందీప్ అనే వ్యక్తి ఎస్ ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ లో యాంకర్ రవి పై ఫిర్యాదు చేసినట్లు సమాచారం.

Telugu Lakhs, Anchor Ravi, Anchorravi, Sandeep-Movie

యాంకర్ రవి తనను బెదిరిస్తున్నాడని, తనకు శారీరకంగా హాని చేస్తానని హెచ్చరిస్తున్నాడంటూ డిస్ట్రిబ్యూటర్ సందీప్ పోలీసులను ఆశ్రయించాడు.రవి వద్ద తీసుకున్న రూ.15లక్షలను తిరిగి చెల్లించకపోతే తన అంతు చూస్తానంటూ బెదిరిస్తున్నాడని అప్పట్లో పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.అయితే ఇప్పుడు తాజాగా యాంకర్ రవి సందీప్ తన వద్ద రూ.41 లక్షలు తీసుకొని మోసం చేశాడు అంటూ కూకట్ పల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడం గమనార్హం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube