అప్పుడప్పుడు కొందరు మగవాళ్ళు తమ భార్యలకు తాము చేసిన తప్పులు తెలవకుండా మరోలా కవర్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు.ఇప్పుడు సోషల్ మీడియా( Social media ) కూడా అందరికీ బాగా అలవాటయింది కాబట్టి.
అందులో భార్యాభర్తల మధ్య వచ్చే సరదా వీడియోలలో చాలావరకు మగవాళ్ళు ఆడవాళ్ళ నుంచి తప్పించుకున్నట్లు కనిపిస్తూ ఉంటాయి.అయితే తాజాగా యాంకర్ రవి కూడా తన భార్యకు దొరకకుండా ఒక పని చేయటంతో వెంటనే జనాలు ఆ విషయాన్ని పట్టుకొని తెగ ఆడుకుంటున్నారు.
టాలీవుడ్ బుల్లితెరపై యాంకర్ గా తనకంటూ ఓ గుర్తింపు సొంతం చేసుకున్నాడు రవి.తన మాటల గారడీతో ఎంతో మంది అభిమానులను కూడా సంపాదించుకున్నాడు.కేవలం బుల్లితెర పైనే కాకుండా వెండితెరపై కూడా పలు సినిమాలు చేసాడు.అలా ఒక క్రేజ్ తెచ్చుకున్న రవి.యాంకర్ కావడానికి కారణం ఒక స్టార్ హీరో అని తెలుస్తుంది.ఇంతకు ఆ స్టార్ హీరో ఎవరు.
రవి( Anchor ravi ) తీసుకుంటున్న రెమ్యూనరేషన్ ఎంతనో తెలుసుకుందాం.
చదువుకుంటూనే నటన మీద ఆసక్తి ఉండటంతో టీవీ యాంకర్ గా పరిచయమయ్యాడు.అలా సంథింగ్ స్పెషల్ షోతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాడు.ఆ తర్వాత వన్ షో, డీ జూనియర్స్, ఫ్యామిలీ సర్కస్, పటాస్ వంటి ఎన్నో ఎంటర్టైన్మెంట్స్ షో లలో యాంకర్ గా చేసి మంచి క్రేజ్ ని సంపాదించుకున్నాడు.
పలు సినీ ఈవెంట్లలో కూడా యాంకర్ గా చేశాడు.ఇక తనకు బుల్లితెర పై క్రేజ్ ఎక్కువగా ఉండటంతో ఏకంగా బిగ్ బాస్ సీజన్ 5( Bigg Boss Season 5 ) లో అవకాశం అందుకున్నాడు.
వెండితెరపై కూడా పలు సినిమాలలో చేశాడు.అలా యాంకర్ గా మంచి పొజిషన్ లో ఉన్న రవి మొదట్లో పదివేల రెమ్యూనరేషన్ తీసుకోగా ఒక హోదాకి వచ్చేసరికి నెలకు 10 లక్షల కు పైగా తీసుకుంటున్నట్లు తెలుస్తుంది.అలా హీరో నాగార్జున సపోర్టుతో అడుగుపెట్టి ఇప్పుడు లక్షలలో పారితోషకం తీసుకొని ఒక గుర్తింపును మోస్తున్నాడు.
ఇక రవి( Anchor Ravi) సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా కనిపిస్తూ ఉంటాడు.నిత్యం ఏదో ఒక పోస్ట్ తో బాగా సందడి చేస్తూ ఉంటాడు.తన ప్రాజెక్ట్ అప్డేట్ల గురించి కూడా బాగా పంచుకుంటూ ఉంటాడు.
ఇక ఈయనకు గతంలోని పెళ్లి కాగా పాప కూడా ఉంది.తన ఫ్యామిలీ ని కూడా పరిచయం చేశాడు రవి.ఇక వాళ్లు కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ గా కనిపిస్తూ ఉంటారు.
ముఖ్యంగా ఆయన కూతురు మాత్రం బాగా యాక్టివ్ గా ఉంటుంది.
ఇక రవి ఒకవైపు ఫ్యామిలీని చూసుకుంటూనే మరోవైపు తన కెరీర్ ను ముందుకు కొనసాగిస్తున్నాడు.సమయం దొరికితే తన ఫ్యామిలీతో ట్రిప్స్ అంటూ తిరుగుతూ బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు.
అయితే ఇదంతా పక్కన పెడితే తాజాగా తను ఒక వీడియో పంచుకున్నాడు.రీసెంట్ గా రవి ఒక ప్రాజెక్టు కోసం విదేశాలకు వెళ్లగా అక్కడ నుండి తిరిగి వస్తున్న సమయంలో తన ఏదో మిస్ అయినట్లు చేతిని చూపిస్తూ అలా ఇంటి వరకు తీసుకొచ్చి తన భార్యను పట్టుకొని హగ్ చేసుకున్నాడు.
అయితే ఆ వీడియో చూసి జనాలు అక్కడ ఏం పనులు చేసావో అన్న.వదినమ్మకు తెలియకుండా తను నీపై అరవకుండా ఈ విధంగా కవర్ చేశావు కదా అన్న అంటూ సరదాగా కామెంట్లు చేస్తున్నారు.
ఇప్పటికే రవి చాలా ఫన్నీ వీడియోస్ పంచుకొని తెగ నవ్వించాడు.