పదహారేళ్లు వచ్చేవరకు దానికి నో.. వియా కామెంట్స్ వైరల్..?

ప్రస్తుతం యువత, ఉద్యోగులు, గృహిణులు, విద్యార్థులు రోజులో ఎక్కువ సమయం స్మార్ట్ ఫోన్ ను వినియోగిస్తున్నారు.స్మార్ట్ ఫోన్ కొనివ్వలేదని కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు కూడా ఉన్నాయి.

 Anchor Ravi Daughter Viya Comments About Smart Phone , Comments,  Ravi Daughter,-TeluguStop.com

సామాన్యుల పిల్లలు స్మార్ట్ ఫోన్ ను వినియోగిస్తారో లేదో చెప్పలేం కానీ సెలబ్రిటీల పిల్లలు మాత్రం స్మార్ట్ ఫోన్ ను తప్పనిసరిగా వినియోగిస్తారు.అయితే యాంకర్ రవి కూతురు వియా మాత్రం తాను స్మార్ట్ ఫోన్ కు దూరంగా ఉంటానని చెబుతుండటం గమనార్హం.

తాజాగా తల్లిదండ్రుల సహాయంతో నెటిజన్లతో ముచ్చటించిన వియా ఈ విషయాన్ని వెల్లడించారు.వియాకు సొంతంగా యూట్యూబ్ ఛానల్ తో పాటు సోషల్ మీడియా అకౌంట్ ఉంది.యూట్యూబ్ ఛానల్ పెట్టడం గురించి వియా స్పందిస్తూ తండ్రి ప్రోత్సాహం, స్పూర్తితోనే యూట్యూబ్ ఛానల్ పెట్టాలనే నిర్ణయం తీసుకున్నానని పేర్కొన్నారు.నెటిజన్లు సంధించిన ప్రశ్నలకు వియా తనదైన శైలిలో జవాబులు చెప్పారు.

Telugu Ravi, Smart Phone, Tollywood, Tv Shows, Viya, Youtube Channel-Movie

తన వ్యక్తిగత విషయాలను కూడా వియా నెటిజన్లకు చెప్పుకొచ్చారు.అయితే ఒక నెటిజన్ ప్రశ్నలకు సమాధానాలు సొంతంగా చెబుతున్నావా ? లేక ఎవరైనా సహాయం చేస్తున్నారా ? అని ప్రశ్నించారు.నెటిజన్లు అడిగిన ప్రశ్నలను అమ్మ తనకు చదివి వినిపిస్తోందని ఆ ప్రశ్నలకు తానే సమాధానాలు ఇస్తున్నానని వియా చెప్పుకొచ్చారు.ఒక నెటిజన్ వియాకు సొంతంగా ఫోన్ ఉందా అని ప్రశ్నించారు.

Telugu Ravi, Smart Phone, Tollywood, Tv Shows, Viya, Youtube Channel-Movie

ఆ ప్రశ్నకు వియా సమాధానంగా తనకు సొంతంగా ఫోన్ లేదని చెప్పుకొచ్చారు.పేరెంట్స్ తనకు 16 సంవత్సరాల వయస్సు వచ్చేవరకు ఫోన్ ను కొనివ్వబోమని చెప్పారని వియా తెలిపారు.ప్రస్తుత కాలంలో పిల్లలు ఫోన్ కు అడిక్ట్ అవుతున్న సంగతి తెలిసిందే.ఫోన్ వల్ల కొంతమంది పిల్లలు చదువుపై సరిగ్గా దృష్టి పెట్టలేకపోతున్నారు.స్మార్ట్ ఫోన్ కు దూరంగా వియాను ఉంచాలని రవి, నిత్యా సక్సేనా తీసుకున్న నిర్ణయాన్ని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube