తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు బిగ్ బాస్ బ్యూటీ అషు రెడ్డి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ఈమె నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా తన అభిమానులతో ముచ్చటిస్తూ ఉంటుంది.
టిక్ టాక్ వీడియోస్ ద్వారా సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకుంది.ఆ తర్వాత ఆమెకు ఉన్న క్రేజ్ తో బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి మరింత పాపులారిటీని సంపాదించుకుంది.
అప్పుడప్పుడు సోషల్ మీడియాలో హాట్ ఫోటో షూట్ లతో కుర్రకారుకు అందాల కనువిందు చేస్తూ ఉంటుంది.ఇక ఈ బ్యూటీ కి సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.
అషు రెడ్డి ఈ మధ్యకాలంలో ట్రెండ్ కు తగ్గట్టుగా కాస్త డిఫరెంట్ గా ఫోటో షూట్ చేస్తూ సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది.
అలా కెమెరాల ముందు తన అందాన్ని ఆరబోస్తూ ఫోటోలకు ఫోజులు ఇవ్వడంతో ఆ ఫోటోలపై నెటిజన్స్ దారుణంగా ట్రోలింగ్స్ చేయడం మొదలుపెట్టారు.
ఆ ఫోటోలపై దారుణమైన కామెంట్లతో మీన్స్ క్రియేట్ చేసి మరీ వైరల్ చేస్తున్నారు.ఈ క్రమంలోనే తాజాగా యాంకర్ రవి అషు రెడ్డి ఫోటోలపై స్పందించాడు.
అషు రెడ్డి,యాంకర్ రవికి మధ్య మంచి ఫ్రెండ్ షిప్ ఉన్న విషయం అందరికీ తెలిసిందే.వీరిద్దరూ తెరపైనే కాకుండా తెరవెనుక కూడా అల్లరి చేస్తూ ఉంటారు.
ఇక యాంకర్ రవి అషురెడ్డి కి మనకు ఉన్న చనువుతోనే ఫోటోలని ఏకిపారేశాడు.ఆమె ఫోటో షూట్ చేస్తున్న ప్రదేశానికి నేరుగా వెళ్లి ఆమెతో ఏంటి ఈ అరాచకం అంటూ అడిగేసాడు యాంకర్ రవి.
ఇక ఆ ఫోటో షూట్ చేస్తున్న కెమెరామెన్ తో కూడా నువ్వైనా చెప్పొచ్చుగా ఆవిడతో అంటూ పరువు తీశాడు.ఇక రవి కామెంట్లపై రియాక్ట్ అయిన అషు రెడ్డి తగ్గేదే లే అంటూ బదులిచ్చింది.ఈ విషయంపై స్పందించిన రవి సాంప్రదాయ దుస్తుల్లో కూడా అలాంటి పోజులు ఏంటి మేడం? చాలామంది మిల్స్ పెడుతున్నారు కనీసం ఆ డ్రస్ కైనా రెస్పెక్ట్ ఇవ్వండి మేడం.అంటూనే కెమెరాలో ఉన్న ఫోటోని చూసి ఇంకో దరిద్రం రెడీ అయింది అని అనేశాడు.
అషురెడ్డి మీమ్స్ రావాలి అని ఇలాంటి పోజులు పెడుతున్నట్లు కెమెరామెన్ యాంకర్ రవి కి తెలిపాడు.ఇదంతా కూడా యాంకర్ రవి తన సోషల్ మీడియా ద్వారా పంచుకున్నాడు.