మేడమ్ మేడమ్ అంటూ కాజల్ ని మోసం చేసిన యాంకర్ రవి?

బిగ్ బాస్ హౌస్ లో ఉన్నటువంటి తొమ్మిది మంది కంటెస్టెంట్ లు ఎంతో పోటీపడుతూ బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ లను పూర్తి చేస్తున్నారు.ఈ క్రమంలోనే బిగ్ బాస్ కెప్టెన్సీ టాస్క్ పోటీని నిర్వహించారు.

 Anchor Ravi Cheated On Kajal In Bigg Boss House,  Bigg Boss 5, Telugu, Ravi, Anc-TeluguStop.com

ఈ క్రమంలోనే బీబీ హోటల్‌ అనే టాస్క్ ఇవ్వగా ఈ టాస్క్ లో భాగంగా శ్రీ రామ్, షణ్ముఖ్ ను చెఫ్, వెయిటర్ గా ఉండమని బిగ్ బాస్ ఆదేశించాడు.యానీ మాస్టర్ మేనేజర్ గా రిసెప్షనిస్ట్ గా రవి ఉద్యోగాన్ని కాపాడుకుని కీపింగ్ వ్యక్తిగా ఉంటాడు.

ఇక కాజల్ హోటల్ ఓనర్ స్నేహితురాలిగా ఉంటుంది.ఇక ఈ హోటల్ కి మానస్ -ప్రియాంక హనీమూన్ కి వచ్చి ఉంటారు.

సన్నీ మొట్టమొదటిసారి ఫైవ్ స్టార్ హోటల్ కి వచ్చిన అతిథిగా ఉండమని బిగ్ బాస్ సూచించారు.

ఇలా కెప్టెన్సీ టాస్క్ లో భాగంగా ఎవరైతే అతిథుల నుంచి 15000 గెలుస్తారు వాళ్ళు ఈ టాస్క్ లో గెలిచినట్టని చెప్పడంతో ఎవరికి వారు ఈ టాస్క్ లో జీవించేశారు.

ఇలా ఎవరికి వారు గెలవాలన్న ఉద్దేశంతో టాస్క్ లను ప్రాణం పెట్టి ఆడారు.ఇక ఈ టాస్క్ లో భాగంగా రవి కాజల్ కి చుక్కలు చూపించాడు.

రవి కాజల్ ను మేడమ్ మేడమ్ అంటూనే తన బ్యాగ్ లో ఉన్న డబ్బులను దొంగలించాడు.ఇలా తన సంచిలో ఉన్న డబ్బులు పోవడంతో కాజల్ నానా హంగామా సృష్టించింది.

ఇలా బిగ్ బాస్ హోటల్ టాస్క్ లో భాగంగా ఎవరికి వారు జీవిస్తున్నారు.మరి ఈ టాస్క్ లో ఎవరు గెలుస్తారు అనేది తెలియాల్సి ఉంది.

Telugu Anchor, Anee Master, Bbhotel, Biggboos, Bigg Boss, Biggboss, Kajal, Ravi,

ఇకపోతే ప్రస్తుతం హౌస్ లో తొమ్మిది మంది కంటెస్టెంట్ లు ఉండగా వీరిలో ఐదు మంది నామినేషన్స్ లో ఉన్నారు.వీరిలో ఎక్కువగా ఈ వారం హౌస్ నుంచి కాజల్ ఎలిమినేట్ అవుతుందనే వార్తలు సోషల్ మీడియాలో పెద్దఎత్తున వస్తున్నాయి.ఇప్పటివరకు సోషల్ మీడియాలో వినిపించిన పేర్లే ప్రతివారం హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యారు.మరి సోషల్ మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం ఈ వారం నిజంగానే కాజల్ హౌస్ నుంచి బయటకు వస్తుందా లేదా అనేది తెలియాల్సి ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube