45 లక్షల రూపాయిలు ఇచ్చి మోసపోయిన యాంకర్ రవి.. ఏం జరిగిందంటే?

తెలుగు బుల్లితెరపై ఎన్నో కార్యక్రమాలకు యాంకర్ గా వ్యవహరిస్తూ ఎంతో మంచి గుర్తింపు దక్కించుకున్న ఫీమేల్ యాంకర్లలో రవి ఒకరు.ఈయన ఎన్నో కార్యక్రమాలకు యాంకర్ గా వ్యవహరిస్తూ విశేషమైన ఆదరణ దక్కించుకున్నారు.

 Anchor Ravi Cheated By Giving 45 Lakh Rupees Do You Know What Happened Anchor Ra-TeluguStop.com

కేవలం యాంకర్ గా మాత్రమే కాకుండా సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటూ రోజురోజుకు ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్న రవి బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు.ఇలా బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళిన మొదటి వారం నుంచి నామినేషన్స్ లో ఉంటూ బిగ్ బాస్ నిర్వహిస్తున్న టాస్క్ లలో ఎంతో చాకచక్యంగా వ్యవహరిస్తూ ప్రతి వారం ఎలిమినేషన్ నుంచి సేవ్ అవుతూ వచ్చారు.

ఇలా బిగ్ బాస్ ద్వార ఎంతో గుర్తింపు సంపాదించుకున్న రవి మరింత ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్నారు.అయితే ఎవరూ ఊహించని విధంగా బిగ్ బాస్ నుంచి 12వ వారం ఎలిమినేట్ కావడంతో ఒక్కసారిగా ఆయన అభిమానులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

బయట ఎంతో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండి హౌస్లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ అయినటువంటి రవి ఏవిధంగా ఎలిమినేట్ అవుతారు అంటూ అభిమానులు బిగ్ బాస్ నిర్వాహకులను ప్రశ్నిస్తున్నారు.హౌస్ లో ఉన్నటువంటి ప్రియాంక కాజల్ కన్నా రవి స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని, వీరిద్దరి కన్నా రవికి ఎంతోమంది అభిమానులు ఉన్నారని రవి ఎలిమినేషన్లో ఏదో కుట్ర జరిగిందని అభిప్రాయం వ్యక్తం చేశారు.

Telugu Lakhs, Anchor Ravi, Biggboss, Friend, Telugu Biggboss, Tollywood-Movie

ఇక రవి బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు తన భార్య తన కూతురు సోషల్ మీడియాలో పెద్దఎత్తున నెగిటివ్ కామెంట్లు చేశారు.ఇక బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన రవి ఈ విషయాలను తెలుసుకొని తన కుటుంబం గురించి నెగిటివ్ కామెంట్స్ చేసిన వారిపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ వారిని సైబర్ క్రైమ్ కింద లీగల్ గా వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.ఇలా బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత రవి ఎన్నో ఇంటర్వ్యూలలో పాల్గొని తన ఎలిమినేషన్ గురించి తనకు కూడా ఎన్నో అనుమానాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు.

Telugu Lakhs, Anchor Ravi, Biggboss, Friend, Telugu Biggboss, Tollywood-Movie

ఇక తన జీవితంలో తను ఒక వ్యక్తిని దారుణంగా నమ్మి మోసపోయిన సందర్భం ఉందని ఈ సందర్భంగా తనకు నమ్మక ద్రోహం చేసిన వారి గురించి తెలిపారు.ఇక ఈ విషయం గురించి రవి మాట్లాడుతూ.ఒక వ్యక్తి తనతో ఎంతో సన్నిహితంగా ఉండి తనని అన్నా అంటూ పిలిచేవాడిని తెలిపారు.

తనకు ఎలాంటి మద్యం, సిగరెట్ అలవాటు లేదని ప్రతి రోజు గుడికి వెళుతూ ఎంతో మంచిగా ఉండే వాడని తనతో చాలా మంచిగా ప్రవర్తించే వాడని రవి తెలిపారు.

Telugu Lakhs, Anchor Ravi, Biggboss, Friend, Telugu Biggboss, Tollywood-Movie

ఇక రవి తనని కూడా ఎంతో బాగా నమ్మాడు.ఇదే సమయంలోనే ఆ వ్యక్తి తన ఒక బిజినెస్ పెట్టబోతున్నాడని అందుకు కొద్దిగా డబ్బులు సర్దుబాటు చేయమని చెప్పారు.20 రోజులలో తన డబ్బు తనకు తిరిగి చెల్లిస్తానని చెప్పడంతో రవి కూడా తనతో బాగా పరిచయం ఉండి నమ్మకంగా ఉండడం వల్ల ఎలాంటి డాక్యుమెంట్స్ లేకుండా తనకు ఏకంగా 45 లక్షల రూపాయలను ఇచ్చారు.ఇలా ఆ వ్యక్తికి 45 లక్షలు ఇవ్వడంతో ఇక తను తనకు కనిపించలేదని రవి తెలిపారు.

తన కోసం ఎన్నో ప్రయత్నాలు చేసిన తన డబ్బు తనకు తిరిగి రాలేదని అలా నమ్మించి తనను దారుణంగా మోసం చేశాడని రవి ఈ సందర్భంగా తెలిపారు.

పెద్ద మొత్తంలో డబ్బులు నష్టపోవడం వల్ల తన భార్యనిత్య ఎలాగైనా ఆ డబ్బులు తిరిగి రావాలని ప్రతి రోజు పూజలు చేస్తూ ఉపవాసాలు చేసిందని అయినా కూడా ఆ డబ్బు తిరిగి రాలేదని రవి తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube