బుల్లితెర యాంకర్లు రవి, సుమ కలిసి జీ తెలుగు ఛానల్ లో బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ అనే షోను హోస్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే.ఈ షోకు భారీ టీఆర్పీ రేటింగ్ లు రాకపోయినా షోను సక్సెస్ చేయడానికి రవి, సుమ తమ వంతు కష్టపడుతున్నారు.
తాజాగా ఈ షో ప్రోమో ప్రసారం కాగా ప్రోమోలో సుమ రవి కాళ్లు పట్టుకుని నెటిజన్లను అవాక్కయ్యేలా చేశారు.ఆదివారం ప్రసారం కాబోతున్న ఈ షోకు ఏ ఎ1 ఎక్స్ ప్రెస్ టీమ్ హాజరైంది.
ఏ1 ఎక్స్ ప్రెస్ సినిమా హీరోహీరోయిన్లు సందీప్ కిషన్, లావణ్య త్రిపాఠి, డైరెక్టర్ డెన్నీస్ జీవన్ ఈ షోలో పాల్గొని సందడి చేశారు.ఈ సినిమాకు బ్లాక్ బస్టర్ హిట్ టాక్ రాకపోయినా గత శుక్రవారం విడుదలైన సినిమాలలో ఈ సినిమా మాత్రమే పాజిటివ్ టాక్ సొంతం చేసుకోవడంతో పాటు పరవాలేదనిపించే స్థాయిలో కలెక్షన్లను రాబడుతోంది.
సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఏ1 ఎక్స్ ప్రెస్ హీరోహీరోయిన్లు, డైరెక్టర్ బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ షోకు గెస్ట్ లుగా హాజరయ్యారు.
బాలీవుడ్ లో హిట్టైనా కజురారే పాటకు సుమ, లావణ్య త్రిపాఠి స్టెప్పులేశారు.
ఆ స్టెప్పులను చూసిన రవి యాంకర్ ఓంకార్ ను ఇమిటేట్ చేసి సందీప్ గారు.ఎలా అనిపించింది మా సుమ గారి పర్ఫామెన్స్ అని అడగగా సుమ పరుగెత్తుకుంటూ వెళ్లి రవి కాళ్లపై పడి ఆశీర్వాదం తీసుకుంటారు.
రవి వెంటనే ఏంటీ పిచ్చి.పిచ్చిపిచ్చిగా ఉందా మీకు అంటూ ఓంకార్ ను ఇమిటేట్ చేస్తూ కామెంట్లు చేస్తారు.
రవి, సందీప్, జీవన్ మార్ డాలా పాటకు స్టెప్పులు వేసి సందడి చేశారు.ఆ పాటకు రవి వేసిన స్టెప్పులు నవ్వు తెప్పించేలా ఉన్నాయి.ఆదివారం రాత్రి 9 గంటలకు ఈ షో ప్రసారం కానుంది.ప్రోమోతో షోపై అంచనాలు పెంచడంలో రవి, సుమ సక్సెస్ అయ్యారనే చెప్పాలి.