వీడియో : బిగ్ బాస్ టీ తాగుతున్నాడు, పట్టుకుందాం పదా!

తెలుగు బిగ్ బాస్ ప్రేక్షకుల ముందుకు వచ్చే నెలలో ఓటీటీ వర్షన్ రాబోతున్న విషయం తెల్సిందే.సోషల్‌ మీడియా సెలబ్రెటీలతో సందడి చేయబోతున్న బిగ్‌ బాస్ ఓటీటీ అందరి దృష్టిని ఆకర్షించబోతుంది.ఈ షో అసలు ఎలా ఉంటుందా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.24 గంటలు కంటెస్టెంట్స్ ను చూసే లైవ్‌ ను కూడా అందుబాటులో ఉంచుతారనే వార్తలు వస్తున్నాయి.కనుక ఖచ్చితంగా ఆసక్తికరంగా ఉంటుందనే నమ్మకంను ప్రతి ఒక్కరు వ్యక్తం చేస్తున్నారు.గతంలో మాదిరిగా వీకెండ్‌ లో శని ఆదివారాలు షో కు నాగార్జున ఈ సీజన్ కు కూడా వస్తాడు.

 Anchor Ravi And Sreerama Chandra Funny Video About Biggboss Ott , Anchor Ravi, Bigbossottt, Flimnews, Sreerama Chandra, Telugu Bigboss-TeluguStop.com

ఇక షో గురించి అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న సమయంలో యాంకర్‌ రవి మరియు సింగర్ శ్రీరామ చంద్రలు కలిసి ఒక ఫన్నీ వీడియోను చేశారు.ఆ వీడియో ప్రస్తుతం వైరల్‌ అవుతోంది.

బిగ్ బాస్ ను వెదుక్కుంటూ యాంకర్ రవి లాంతరు పట్టుకుని బయలు జేరాడు.బిగ్ బాస్ బిగ్ బాస్ మిమ్ములను నా కూతురు చూడాలనుకుంటుంది అంటూ వెదకడం మొదలు పెట్టాడు.అతడి వెంట వచ్చిన శ్రీరామ చంద్ర ఏం వెదుకుతున్నావు అంటూ ప్రశ్నించగా బిగ్‌బాస్ ఓటీటీ అంటున్నారు.అంటే బిగ్‌ బాస్ బయటకు వచ్చినట్లుగా ఉన్నాడు.అందుకే ఆయన కోసం వెదుకుతున్నాను అన్నాడు.అందుకు అయ్యో బిగ్ బాస్ ఓటీటీ అంటే బిగ్‌ బాస్ టీ స్టాల్‌లో ఉన్నాడు అని అర్థం.

 Anchor Ravi And Sreerama Chandra Funny Video About Biggboss Ott , Anchor Ravi, Bigbossottt, Flimnews, Sreerama Chandra, Telugu Bigboss-వీడియో : బిగ్ బాస్ టీ తాగుతున్నాడు, పట్టుకుందాం పదా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

పదా ఇద్దరం కలిసి వెళ్లి బిగ్‌ బాస్ ను టీ స్టాల్‌ లో వెదుకుదాం అంటూ ముందుకు వెళ్లారు.మొత్తానికి బిగ్ బాస్ ఓటీటీ ని వీరిద్దరు సరదాగా ప్రమోట్‌ చేయడం బాగుంది అంటూ నెటిజన్స్‌ కామెంట్స్ చేస్తున్నారు.

బిగ్‌ బాస్‌ సీజన్‌ 5 లో వీరిద్దరు టాప్‌ టు లేదా త్రి లో ఉంటారని అంతా ఆశించారు.కాని వీరిద్దరు కనీసం రన్నర్ గా కూడా నిలువలేదు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube