ప్రతి అమ్మాయ్ అలా అవ్వాలంటున్న యాంకర్ రవి!  

anchor ravi about his daughter as jhansi lakshmi bai ,anchor ravi, jhansi lakshmi bai, every women, tollywood-zee telugu,edhi naprama katha-viral video-youube channel-ravi his daughter - Telugu Anchor Ravi, Every Women, Jhansi Lakshmi Bai, ఝాన్సీ లక్ష్మీబాయి, యాంకర్ రవి

బుల్లితెర యాంకర్ రవి గురించి మనకు తెలిసిందే.ఒకప్పుడు బిగ్ బాస్ లాస్య తో యాంకరింగ్‌ ప్రయాణంను మొదలు పెట్టిన తను ప్రస్తుతం ఒక రేంజ్ లో దూసుకుపోతున్నాడు.

TeluguStop.com - Anchor Ravi About His Daughter As Jhansi Lakshmi Bai

ఒకేసారి ఎన్నో ఆఫర్లతో బిజీగా ఉంటున్న రవి మొదట్లో తన వ్యక్తిగత విషయాలను ఎన్నో దాచాడు.

2017 లో అయోధ్య కార్తీక్ దర్శకత్వంలో వచ్చిన ప్రేమ కథ సినిమాలో హీరోగా తెరకెక్కాడు.నిజానికి రవి కి నటుడిగా కంటే యాంకరింగ్ విషయంలో మంచి గుర్తింపు ఉంది.ఈటీవీ, స్టార్ మా, జీ తెలుగు వంటి ఛానల్ లో ప్రసారమవుతున్న కార్యక్రమాలకు యాంకరింగ్‌ చేస్తున్నారు.

TeluguStop.com - ప్రతి అమ్మాయ్ అలా అవ్వాలంటున్న యాంకర్ రవి-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

అంతేకాకుండా సినిమాలకు సంబంధించిన ఆడియో ఫంక్షన్లకు కూడా తన వంతు పాత్ర చేస్తుంటాడు.ఇదిలా ఉంటే తన వ్యక్తిగత విషయంలో తన కుటుంబం గురించి ఎప్పుడు చెప్పని రవి ఒకసారి తనకు పెళ్ళయిందని ఓ పాప కూడా ఉందని చెప్పగానే ప్రేక్షకులు ఆశ్చర్యపోయారు.

ఇక అప్పటి నుంచి తన కుటుంబం గురించి బయటపెట్టిన తర్వాత సోషల్ మీడియాలో తన కుటుంబంతో సహా వీడియో లు చేస్తూ షేర్ చేస్తూంటాడు.ఇదిలా ఉంటే ఇటీవల తన భార్య పిల్లలతో కలిసి కొన్ని వీడియోలు చేయగా తన యూట్యూబ్ ఛానల్ ద్వారా పెళ్ళాం తో ఉండే బాధలు, వారితో కలిసి షాపింగ్ ఎలాంటి కష్టాలు ఉంటాయో లాంటి వీడియోలను చేయడంతో వాటికి అభిమానులు ఎక్కువగా ఫాలో అవుతున్నారు.

అంతే కాకుండా తన కూతురు వియా తో కలిసి ఆకట్టుకునే వీడియోలను చేస్తుంటాడు.ఇంతకుముందు ఓ కార్యక్రమంలో తన కూతురు పాల్గొనగా.

తన కూతురు తో ఆడుకుంటూ ఎమోషనల్ గా ఫీల్ అయిన సంగతి మనకు తెలిసిందే.

తాజాగా జనవరి 26 సందర్భంగా వీడియోని విడుదల చేయగా ప్రస్తుతం అది వైరల్ గా మారింది.ఈ వీడియోలో తన కూతురు వియా కు‌ స్వాతంత్ర సమరయోధురాలి ఝాన్సీ లక్ష్మీబాయి వేషధారణను వేయించాడు.ఝాన్సీ లక్ష్మీబాయి తన పిల్లాడిని వీపుకు కట్టుకొని పోరాటం చేసిన దృశ్యాన్ని తన కూతురు తో వేయించాడు రవి.ఈ వీడియోలో తన పాప ఎంతో బాగా నటించింది.ప్రస్తుతం ఈ వీడియో వైరల్ కాగా.

ప్రతి ఒక అమ్మాయి ఇప్పుడున్న పరిస్థితుల్లో యోధురాలిగా మారాల్సిందే అని రవి తెలిపాడు.

#Anchor Ravi #Every Women

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు