పెళ్ళి చేసుకుంటున్న యాంకర్ రష్మీ ? ఎవరిని అంటే ..

జబర్దస్త్ బ్యూటి రష్మీ గౌతమ్ జయాపజయాలను పట్టించుకోకుండా తన ప్రయత్నాలు తాను చేసుకుంటూపోతోంది.బుల్లి తెర మీద డిమాండ్ తగ్గింది.

 Anchor Rashmi To Marry In Vizag?-TeluguStop.com

అనసూయ, శ్రీముఖిల డామినేషన్ వలన తనకు పెద్దగా అవకాశాలు రావట్లేదు.మరోవైపు సినిమాల్లో ఏమైనా రాణించిందా అంటే, ఒక్క గుంటూరు టాకీస్ మినహాయిస్తే ఏ సినిమా ఎప్పుడు వచ్చిందో, ఎప్పుడు పోయిందో రష్మీకి కూడా గుర్తుండదు.

అటు చేసి ఇటు చేసొ యూవి క్రియేషన్స్ – గీతా ఆర్ట్స్‌ సంయుక్తంగా నిర్మించనున్న ఓ సినిమాలో ఛాన్స్ కొట్టేసింది రష్మీ.ఈ సినిమా ఫలితం మీదే రష్మీ కెరీర్ ఆధారపడి ఉంది.

కాని ముందుజాగ్రత్తగా ముందే మూట సర్దేసుకుంటోందా ఈ హాట్ యాంకర్? గ్లామర్ ప్రపంచాన్ని వదిలేసి పెళ్ళి చేసుకోని సెటిల్ అయిపోదామనుకుంటోందా? రష్మీ పెళ్ళాడబోయే ఆ లక్కి పర్సన్ ఎవరు?

రష్మీ ఏదో మాటవరసకి వైజాగ్ లో సెటిల్ అవుతాను అని అంది.అంతే, ఎక్కడలేని రూమర్స్ పుట్టుకొచ్చేసాయి.

సెటిల్ అనే పదంలో ఒకటా రెండా, ఎన్నో అర్థాలున్నాయిగా మరి.రష్మీ సినిమాలు, టీవి వదిలేస్తోందని, వైజాగ్ కి చెందిన ఓ బిజినెస్ మెన్ ని పెళ్ళి చేసుకోబోతోందని, అక్కడే వైజాగ్ లోనే సెటిల్ అయిపోతోందని ఒకదాని తరువాత ఒకటి రూమర్స్ పుట్టుకొచ్చాయి.నిజానికైతే రష్మీ ఇప్పుడప్పుడే పెళ్ళి చేసుకోదట.ఎప్పటికైనా వైజాగ్ లో సెటిల్ అవ్వాలని రష్మీ కోరిక, అంతే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube