దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకుంటున్నాను అంటున్న రష్మి

హాట్‌ యాంకర్‌ రష్మి ప్రస్తుతం జబర్దస్త్‌ షోకు యాంకర్‌గానే కాకుండా హీరోయిన్‌గా కూడా నటిస్తున్న విషయం తెల్సిందే.ఈ అమ్మడు ప్రస్తుతం ఒక రొమాంటిక్‌ సినిమాలో నటిస్తున్న విషయం తెల్సిందే.

 Anchor Rashmi Responds To Glamours Roles-TeluguStop.com

ఇటీవల ఈమె అలీ టాక్‌ షోలో పాల్గొంది.ఆ సందర్బంగా వరుసగా గ్లామర్‌ పాత్రలే ఎందుకు చేస్తున్నావంటూ అలీ డైరెక్ట్‌గా అడిగేశాడు.

అందుకు రష్మి చాలా ఆసక్తికర సమాధానం, అందరు ఒప్పుకునే సమాధానం ఇచ్చింది.
ఇంతకు రష్మి ఏమన్నదంటే ప్రస్తుతం అందంగా, వయసులో ఉన్నాం కనుక ఇప్పుడే సినిమాలు చేయాలి.

ఇలాంటి సమయంలో కాకుండా వయసు ముదిరిన తర్వాత అలాంటి పాత్రలు చేసినా కూడా ఎవరు చూడరు.ఒక వేళ చేయాలనుకున్నా కూడా అవకాశాలు రావు అంది.అందుకే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అనే ఉద్దేశ్యంతో ఇలా చేస్తున్నట్లుగా ఈ అమ్మడు చెప్పుకొచ్చింది.

Telugu Alitho Saradaga, Anchor Rashmi, Anchorrashmi, Glamours, Jabardasth-

నిర్మొహమాటంగా ఈ అమ్మడు చేసిన ప్రకటనతో అంతా కూడా అవాక్కవుతున్నారు.ముఖ్యంగా ఈ అమ్మడు మరీ బోల్డ్‌ చిత్రంలో నటించడంపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఈమె సమాధానం అందరికి నోరు మూయించినట్లయ్యింది.ప్రస్తుతం ఈమె జబర్దస్త్‌ షోలోనే తన అందాలతో అలరిస్తూ ఉంది.

ఇక సినిమాల్లో కూడా రెగ్యులర్‌గా ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌ చేస్తానంటూ హామీ ఇచ్చింది.ఈమె చేసిన ప్రకటన అభిమానుల్లో ఆనందాన్ని కలిగిస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube