అనసూయ చేసిన తప్పు చేయను అన్న రష్మి..!

బంగారు బాతును వదలాలి అంటే ఎంతటి వారికి అయినా కూడా కష్టమే.ఇతర మార్గాల నుండి ఎంతటి అవకాశాలు ఉన్నా, ఎంతటి ధనం వచ్చే సూచనలు ఉన్నా కూడా మొదటి నుండి ఉన్న బంగారు బాతును మాత్రం వదిలి పెట్ట కూడదు.

 Anchor Rashmi On Quitting Jabardasth Rumors-TeluguStop.com

ఇదే విషయాన్ని జబర్దస్త్‌ యాంకర్‌ రష్మి ఫాలో అవుతోంది.బంగారు బాతు వంటి జబర్దస్త్‌ను వదిలేసి ఆ తర్వాత బాధ పడ్డ అనసూయను చూసి రష్మి తాను ఆ తప్పు చేయను అంటోంది.

జబర్దస్త్‌ కామెడీ షోకు యాంకరింగ్‌ చేస్తున్న రష్మికి మంచి క్రేజ్‌ వచ్చింది.ఈ క్రేజ్‌తో సినిమాల్లో హీరోయిన్‌ ఆఫర్స్‌ కూడా వస్తున్నాయి.

ఇప్పటికే ఈమె రెండు మూడు సినిమాల్లో నటిస్తూనే ఉంది.ఈ క్రమంలోనే రష్మి జబర్దస్త్‌ను వదిలేయబోతుందని, సినిమాలతో బిజీ అవ్వడం వల్ల యాంకరింగ్‌ను వదిలేస్తానంటోంది అంటూ మీడియాలో వార్తలు వచ్చాయి.

మీడియాలో వచ్చిన వార్తలను, వస్తున్న పుకార్లను రష్మి కొట్టి పారేసింది.తాను ఎన్ని సినిమాల్లో ఆఫర్లు వచ్చినా కాని జబర్దస్త్‌ను వదులుకునేది లేదు అంటూ రష్మి క్లారిటీ ఇచ్చింది.

ఈటీవీలో ప్రసారం అయ్యే జబర్దస్త్‌ కార్యక్రమాలతో పాటు ఈటీవీ ప్లస్‌లో వస్తున్న రెండు కొత్త కార్యక్రమాల్లో కూడా రష్మి యాంకరింగ్‌ చేస్తోంది.మొత్తానికి వెండి తెర ఆఫర్లు వచ్చినా కూడా బుల్లి తెరను మాత్రం వదిలేది లేదు అని చెబుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube