సుధీర్ కు నిజంగానే ముద్దు పెట్టిన రష్మీ.. ఏమైందంటే..?

సాధారణంగా వెండితెర జోడీలను అభిమానించే అభిమానులు ఎక్కువసంఖ్యలో ఉంటారు.అయితే సుధీర్ రష్మీ బుల్లితెర జోడీ అయినప్పటికీ వెండితెర జోడీలకు ధీటుగా ఈ జోడీకి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

 Anchor Rashmi Kiss To Sudheer In Dhee 13-TeluguStop.com

సుధీర్, రష్మీ వేరువేరుగా చేసే షోల కంటే ఈ జోడీ కలిసి చేసే షోలకే ప్రేక్షకాదరణ ఎక్కువగా ఉంటుంది.దాదాపు ఏడు సంవత్సరాలుగా బుల్లితెరపై ఈ జంట సందడి చేస్తూనే ఉండగా అభిమానులు ఈ జోడీని అభిమానిస్తూనే ఉన్నారు.

వీళ్లిద్దరూ కలిసి చేస్తున్న స్కిట్లు, ఒకరిపై మరొకరు వేసుకునే పంచ్ లు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.అటు రష్మీ ఇటు సుధీర్ మూడు పదుల వయస్సు దాటినా పెళ్లి చేసుకోకపోవడంతో ఈ జోడీ పెళ్లి చేసుకోవాలని కోరుకునే అభిమానుల సంఖ్య కూడా అంతకంతకూ పెరుగుతోంది.సుధీర్ రష్మీపై ప్రేమ ఉందనే విధంగా పలు సందర్భాల్లో కామెంట్లు చేయగా రష్మీ కూడా రివర్స్ లో కౌంటర్లు ఇస్తూ వార్తల్లో నిలిచారు.

 Anchor Rashmi Kiss To Sudheer In Dhee 13-సుధీర్ కు నిజంగానే ముద్దు పెట్టిన రష్మీ.. ఏమైందంటే..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

రష్మీసుధీర్ జోడీకి యూట్యూబ్ జోడీగా కూడా పేరు ఉంది.

జబర్దస్త్ షోతో పాటు ఈ జోడీ ఢీ షో కూడా చేస్తున్నారు.తాజాగా ఢీ షో ప్రోమో రిలీజ్ కాగా ప్రోమోలో రష్మీ, సుధీర్ జోడీ ప్రోమోలో హల్చల్ చేశారు.

తాజాగా రిలీజైన ప్రోమోలో రష్మీ సుధీర్ కు ముద్దు పెట్టింది.డైరెక్ట్ గా కాకపోయినా సుధీర్ కు రష్మీ ఫ్లైయింగ్ కిస్ ఇవ్వడం గమనార్హం.

రష్మీ అలా చేయడంతో ఆశ్చర్యపోయిన సుధీర్ విచిత్రమైన ఎక్స్ ప్రెషన్ పెట్టాడు.

సంవత్సరాలు గడుస్తున్నా సుధీర్ రష్మీ జోడీ ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ ను అందిస్తుండటం గమనార్హం.బుల్లితెరపై మరికొన్ని సంవత్సరాల పాటు ఈ జోడీ హవా కొనసాగే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పవచ్చు.రష్మీ సుధీర్ జోడీకి ఫ్యాన్ ఫాలోయింగ్ అంతకంతకూ పెరుగుతోంది.

#Dhee13 #Sudheer #Flying Kiss #Anchor Rashmi

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు