వకీల్ సాబ్ లో ఐటెం సాంగ్ గర్ల్ గా మారిన యాంకర్ రష్మి

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూడేళ్ళ గ్యాప్ తర్వాత ప్రేక్షకుల ముందుకి వస్తున్న సినిమా వకీల్ సాబ్.దిల్ రాజు ప్రొడక్షన్ లో వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా పింక్ మూవీకి రీమేక్ అనే విషయం అందరికి తెలిసిందే.

 Anchor Rashmi Item Song In Vakeel Saab Movie, Tollywood, Telugu Cinema, Pawan Ka-TeluguStop.com

భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా కథాంశం పవన్ కళ్యాణ్ ఇమేజ్ కి తగ్గట్లు కాస్తా మార్పులు చేసినట్లు తెలుస్తుంది.ఇదిలా ఉంటే ఈ సినిమాలో నివేదా థామస్, అంజలి కీలక పాత్రలలో నటిస్తూ ఉండగా, శృతి హసన్ హీరోయిన్ గా చేసింది.

ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా రిలీజ్ కి రెడీ అవుతుంది.ఈ సినిమా గురించి ప్రస్తుతం ఆసక్తికరమైన వార్త ఫిలిం నగర్ లో వినిపిస్తుంది.

ఈ సినిమాలో హాట్ యాంకర్ రష్మి కూడా నటించిందని టాక్ బలంగా వినిపిస్తుంది.ఆమె ఈ సినిమాలో ఓ ఐటెంలో సందడి చేయబోతుందని బోగట్టా.

సినిమా కథాంశం ప్రకారం ఒరిజినల్ లో ఎలాంటి సాంగ్స్ లేకపోయిన పవన్ ఇమేజ్ కోసం సినిమాలో మూడు పాటలని పెట్ట్లినట్లు తెలుస్తుంది.అందులో ఒకటి శృతి హసన్, పవన్ కళ్యాణ్ మధ్య ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో వచ్చే రొమాంటిక్ డ్యూయెట్ ఒకటి కాగా మరొకటి బ్యాగ్రౌండ్ సాంగ్ గా ఉంటుందని టాక్.

ఇక విలన్స్ బ్యాక్ డ్రాప్ లో ఒక ఐటెం సాంగ్ కూడా ఉండబోతుందని ఆ సాంగ్ రష్మి మీద చిత్రీకరించినట్లు తెలుస్తుంది.సినిమాలో ఈ సాంగ్ చాలా హైలైట్ గా ఉండబోతుందని బోగట్టా.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube