సుధీర్ చాలా రొమాంటిక్.. యాంకర్ రష్మీ కామెంట్స్ వైరల్..?

బుల్లితెరపై, వెండితెరపై ఆఫర్లను అందిపుచ్చుకుంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న యాంకర్లలో రష్మీ ఒకరు.ఒడిశా రష్మీ స్వస్థలం కాగా ఏపీలోని విశాఖపట్నంలో రష్మీ బాల్యం గడిచింది.2002 సంవత్సరంలో రిలీజైన హోలీ సినిమాతో రష్మీ సినీ కెరీర్ ను మొదలుపెట్టగా ఆ తరువాత కరెంట్, ప్రస్థానం, మరికొన్ని సినిమాల్లో నటించినా నటిగా రష్మీకి పెద్దగా గుర్తింపు రాలేదు.అయితే గుంటూరు టాకీస్ సినిమాలోని పాత్ర రష్మీకి మంచిపేరును తెచ్చిపెట్టింది.

 Anchor Rashmi Interesting Comments About Sudheer,latest Tollywood News-TeluguStop.com

Telugu Anchor Rashmi, Romantic, Sudheer-Movie

ప్రస్థానం సినిమాలో రష్మీ నటించిన తరువాత ఆమెకు సిస్టర్ రోల్స్ లో నటించే ఆఫర్స్ ఎక్కువగా రాగా ఆ ఆఫర్స్ కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ఇష్టం లేక రష్మీ సినిమాలకు కొంతకాలం గ్యాప్ ఇచ్చారు.అదే సమయంలో జబర్దస్త్ షోలో ఆఫర్ రావడం యాంకర్ గా రష్మీ సక్సెస్ కావడం జరిగింది.తాను హీరోయిన్ గా అనుకున్న స్థాయిలో సక్సెస్ కాకపోవడానికి చాలా కారణాలు ఉన్నాయని రష్మీ చెప్పుకొచ్చారు.

తనకు చెప్పే స్క్రిప్ట్ కు సినిమాకు సంబంధం ఉండేది కాదని స్క్రీన్ పై తనను ప్రాధాన్యత లేకుండా చూపించే వాళ్లని రష్మీ తెలిపారు.

ఈ రీజన్ వల్లే తాను నటించిన సినిమాలు అనుకున్న స్థాయిలో హిట్ కాలేదని రష్మీ వెల్లడించారు.కొన్ని సినిమాలు కష్టపడి చేసినా హిట్ కావని రష్మీ అన్నారు.

శృతి మించిన సన్నివేశాలలో చేయడానికి తాను అంగీకరించనని సినిమాకు ఎంత అవసరమో అంతవరకే తాను శృంగార సన్నివేశాల్లో నటిస్తానని రష్మీ పేర్కొన్నారు.

Telugu Anchor Rashmi, Romantic, Sudheer-Movie

తనకు ఐటెం సాంగ్స్ లో చేయాలనే ఆఫర్లు చాలానే వచ్చాయని తన శరీరాకృతికి బికినీ సరిపోదు కాబట్టి బికినీ ధరించనని రష్మీ అన్నారు.సుధీర్ లో రొమాంటిక్ యాంగిల్ బాగుంటుందని సుధీర్ చాలా సున్నితమైన మనిషని రష్మీ తెలిపారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube