ఒకే దుప్పట్లో సుధీర్ రష్మీ.. వాళ్లను మించిపోయేలా..?

ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదలైన ఉప్పెన సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడంతో పాటు ఆ సినిమాలో హీరోహీరోయిన్లుగా నటించిన వైష్ణవ్ తేజ్ కృతిశెట్టిలకు మంచి పేరు తెచ్చిపెట్టిన సంగతి తెలిసిందే.అశీ బేబమ్మ పాత్రల్లో వైష్ణవ్, కృతిశెట్టి అద్భుతంగా నటించారు.

 Anchor Rashmi Gautam Sudheer Romance For Uppena Movie Song-TeluguStop.com

అయితే ఉప్పెన సినిమా స్పూఫ్ లో యాంకర్ రష్మీ, సుడిగాలి సుధీర్ అద్భుతంగా చేశారు.వైష్ణవ్, కృతిశెట్టిలను మించిపోయేలా సుధీర్ రష్మీ స్పూఫ్ చేయడం గమనార్హం.

ఉగాది పండుగ సందర్భంగా ఈటీవీ ఛానెల్ నిర్వాహకులు ఉగాది జాతిరత్నాలు పేరుతో ఒక ఈవెంట్ ను నిర్వహిస్తున్నారు.జబర్దస్త్ కమెడియన్లు ఈ ఈవెంట్ లో తమ ఫేవరెట్ హీరోల పాటలకు అదిరిపోయే స్టెప్పులు వేశారు.

 Anchor Rashmi Gautam Sudheer Romance For Uppena Movie Song-ఒకే దుప్పట్లో సుధీర్ రష్మీ.. వాళ్లను మించిపోయేలా..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ట్రెండింగ్ జోడీ ఈజ్ బ్యాక్ పేరుతో సుధీర్, రష్మీతో జలజల జలపాతం సాంగ్ ను షూట్ చేశారు.ఆ సాంగ్ లో రష్మీ సుధీర్ ను ఒకే దుప్పటిలో కప్పేస్తారు.

రష్మీ సుధీర్ ల మధ్య రొమాన్స్ ప్రోమోకు హైలెట్ అయింది.

ఆ తరువాత వీడు ముసలోడు అవ్వకూడదంటూ రష్మీ సుధీర్ ను చూసి చెప్పగా సుధీర్ మీసాలను మెలేస్తారు.ఉప్పెన స్పూఫ్ ఈ ఈవెంట్ పై అంచనాలను భారీగా పెంచేసింది.ఉప్పెన సినిమాలో హిట్టైన సాంగ్ నే సుధీర్ రష్మీపై అద్భుతంగా షూట్ చేశారు.

ఈ నెల 13వ తేదీన ఉగాది పండుగ కానుకగా ఈ ఈవెంట్ ప్రసారం కానుంది.సుధీర్ రష్మీ జోడీకి ఉన్న క్రేజ్ ను దృష్టిలో ఉంచుకుని ఈటీవీ ఛానెల్ నిర్వాహకులు ఈ జోడీ ద్వారా ఈవెంట్ పై అంచనాలు పెంచుతున్నారు.

రష్మీ సుధీర్ పై కాళ్లు పెట్టడంతో పాటు అద్భుతంగా పర్ఫామెన్స్ ఇచ్చారు.నిజమైన లవర్స్ అనే స్థాయిలో సుధీర్ రష్మీ పర్ఫామెన్స్ చేయడం గమనార్హం.

#Sudheer Rashmi #Kruti Shetty #Vaishnav Tej

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు