సాయం చేయకపోయినా పర్లేదు... అలా మాత్రం చేయకండి.. వేడుకుంటున్న రష్మీ?

బుల్లితెర యాంకర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న వారిలో యాంకర్ రష్మీ ఒకరు.ఎక్స్ట్రా జబర్దస్త్ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఈమె ప్రస్తుతం జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమాలతో ఎంతో బిజీగా ఉన్నారు.

 Anchor Rashmi Gautam Emotional Post On Animals Details, Rashmi , Extra Jabardast-TeluguStop.com

ఇలా వరుస కార్యక్రమాలను చేస్తూ ప్రేక్షకులను పెద్ద ఎత్తున సందడి చేస్తున్నటువంటి రష్మీ సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటారు.ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటారు.

ఇకపోతే రష్మీ అందరిని ఆకట్టుకునే అందంతో కాకుండా ఎంతో మంచి మనసు కూడా ఉందని ఎన్నోసార్లు నిరూపించుకుంది.ముఖ్యంగా ఈమె మూగజీవాల పట్ల తీసుకునే రక్షణ చర్యల గురించి మనం ఇదివరకే చూసాము.

 Anchor Rashmi Gautam Emotional Post On Animals Details, Rashmi , Extra Jabardast-TeluguStop.com

మూగజీవాల పట్ల ఎవరైనా కఠినంగా ప్రవర్తిస్తే వారికి తప్పకుండా చర్యలు తీసుకునే వరకు ఈమె పోరాటం చేస్తుంటారు.అలాగే ఎక్కడైనా వీధి కుక్కలకు లేదా ఇతర జీవాలకు ప్రమాదం జరిగితే వాటిని రక్షించే బాధ్యతను తీసుకుంటారు.

ఈ విధంగా రష్మీ మూగజీవాల పట్ల ఎంతో శ్రద్ధ చూపిస్తారనే విషయం మనకు తెలిసిందే.

Telugu Anchorrashmi, Animals, Animals Mutes, Dogs, Extrajabardast, Humanity, Ras

ఇక కరోనా వంటి విపత్కర సమయంలో కూడా ఈమె మూగజీవాలకు తిండి ఏర్పాటు చేసి మూగజీవాల పట్ల తనకు ఉన్న ప్రేమను తెలియజేశారు.ఇదిలా ఉండగా తాజాగా రష్మీ సోషల్ మీడియా వేదికగా మూగజీవాల పట్ల ఎంతో ఆవేదన వ్యక్తం చేశారు.అందరికీ జంతువులకు సహాయం చేసే స్థితి ఉండకపోవచ్చు.

కానీ వాటిని హింసించకుండా ఉండే స్థితి మాత్రం ఉంటుంది.అని ఆంటోని డగ్లస్ విలియం చెప్పిన కోట్ పోస్ట్ చేశారు.

ఈ సందర్భంగా ఈమె మీరు సహాయం చేయకపోయినా పర్వాలేదు వాటిని హింసించకుండా ఉంటే వాటికి సహాయం చేసినట్లేనని మూగజీవాల పట్ల తన ప్రేమను వ్యక్తం చేశారు.ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube