షాపింగ్ మాల్ ఓపెనింగ్ కి వచ్చిన రష్మీ.. ఫ్యాన్స్ అరాచకం?

యాంకర్ రష్మి తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు.ఈమెకు ఉన్న ఫ్యాన్స్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

 Anchor Rashmi Gautam Craze At Chittoor Shopping Mall Opening-TeluguStop.com

జబర్దస్త్ షో ద్వారా పాపులర్ సంపాదించుకున్న వారిలో యాంకర్ రష్మి కూడా ఒకరు.ఈమె ఎక్స్ ట్రా జబర్దస్త్ షో కి యాంకర్ గా చేస్తోంది.

రష్మి కి స్టార్ హీరోయిన్లతో సమానంగా తెలుగు రాష్ట్రాల్లో క్రేజ్ ఉంది అంటే అతియోశక్తి కాదు.ఇక ఈమె ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ మెగా ఫ్యాన్స్ ఈమెను చూడటానికి భారీగా తరలి వస్తుంటారు.

 Anchor Rashmi Gautam Craze At Chittoor Shopping Mall Opening-షాపింగ్ మాల్ ఓపెనింగ్ కి వచ్చిన రష్మీ.. ఫ్యాన్స్ అరాచకం-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ నేపథ్యంలోనే తాజాగా ఈమె చిత్తూరు జిల్లాలో ఒక షాపింగ్ మాల్ ప్రారంభించడానికి వచ్చింది.షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన రష్మీ ని చూసేందుకు భారీగా జనం వచ్చారు.

ఇక ఆ ప్రాంతం ఒక్కసారిగా రద్దీగా మారిపోయింది.రష్మీ తో ఫోటోలు దిగడానికి అభిమానులు ఎగబడటంతో వారిని అదుపు చేయడం షాపింగ్ మాల్స్ సిబ్బంది వల్ల కాలేకపోయింది.

దీంతో అక్కడ కొద్దిసేపు తోపులాట గందరగోళ పరిస్థితి కనిపించింది.

Telugu Anchor Rashmi, Chittoor, Chittoor Shopping Mall, Jabardasth, Jabardasth Show, Rashmi Gautam, Rashmi Shopping Mall Opening, Shopping Mall Open-Movie

కొంతమంది ఆకతాయిలు అయితే రష్మీ మీదికి దూసుకు వచ్చారు.ఆమెను తాకేందుకు ప్రయత్నించారు అయినా కూడా రష్మీ అసహనానికి గురి కాకుండా నవ్వుతూనే అభిమానులకు సర్ది చెప్పింది.ఆ గందరగోళ పరిస్థితులలో రిబ్బన్ కట్ చేయడానికి కూడా రష్మి కి వీలు పడలేదు.

జనం తోపులాట మధ్య నుంచి షాపింగ్ మాల్ కు అడుగుపెట్టిన రష్మి జ్యోతి ప్రజ్వలన చేసి షాపింగ్ మాల్ ను ప్రారంభించింది.

#Chittoor #Chittoor #Rashmi Gautam #Anchor Rashmi #Rashmi

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube