సుధీర్ చేస్తే ఒప్పు నేను చేస్తే తప్పా.. రష్మీ సంచలన వ్యాఖ్యలు?

టాలీవుడ్ స్టార్ యాంకర్లలో రష్మీ గౌతమ్ ఒకరనే సంగతి తెలిసిందే.యాంకర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న రష్మీ గౌతమ్ ఈ మధ్య కాలంలో ఈటీవీ ఛానల్ తో పాటు ఇతర ఛానల్ ఈవెంట్లలో కూడా కనిపిస్తూ పాటలు పాడటంతో పాటు డ్యాన్సులు చేస్తూ ఎంటర్టైన్మెంట్ ను అందిస్తున్నారు.

 Anchor Rashmi Comments On Trolls And Say No Need To Consider, Comments On Trolls-TeluguStop.com

తాజాగా ఎక్స్ట్రా జబర్దస్త్ షో ప్రసారం కాగా ఈ షోలో రష్మీ సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు.నెటిజన్ల కామెంట్లపై ఈ బ్యూటీ మండిపడ్డారు.

వర్ష తన తమ్ముడు నెటిజన్ల కామెంట్లను చూపిస్తూ తనను ప్రశ్నించాడని గతవారం ప్రోమోలో చెప్పిన సంగతి తెలిసిందే.వర్ష తన బాధను వ్యక్తం చేయగా రోజాతో పాటు రష్మీ వర్షకు ధైర్యం చెప్పారు.

వాళ్లు ఇచ్చిన ధైర్యంతో వర్ష తాను జబర్దస్త్ షోను వీడనని వెల్లడించారు.ట్రోల్ చేసేవాళ్లను పట్టించుకోవాల్సిన అవసరం ఏ మాత్రం లేదని రష్మీ కామెంట్లు చేయడం గమనార్హం.

రష్మీ మాట్లాడుతూ చాలామంది అబ్బాయిలు అమ్మాయిలు సమానమని అంటారని కానీ రియాలిటీ వేరుగా ఉంటుందని తెలిపారు.

Telugu Trolls, Jabardasth Show, Rashmi Gautam, Roja, Varsha-Movie

సుధీర్ వేరే హీరోయిన్లతో యాక్టింగ్ చేస్తే నెగిటివ్ కామెంట్లు ఎవరూ చేయరని అయితే తాను మరో హీరోకు జోడీగా నటిస్తే సుధీర్ తో మాత్రమే చేయాలనే కామెంట్లు వ్యక్తమవుతున్నాయని రష్మీ అన్నారు.అబ్బాయిలు ఎంతమందితో పులిహోర కలిపినా ఎవరూ ఏమీ అనరని అమ్మాయిల విషయంలో మాత్రం అలా కాదని రష్మీ తెలిపారు.అలా ఎందుకు చేస్తారనే విషయం తనకు అర్థం కాదని రష్మీ పేర్కొన్నారు.

Telugu Trolls, Jabardasth Show, Rashmi Gautam, Roja, Varsha-Movie

తనపై వచ్చే ట్రోల్స్ గురించి స్పందిస్తూ ఇలా ట్రోల్ చేయడం వల్లే చాలామంది జీవనం సాగిస్తున్నారని వాళ్ల గురించి పట్టించుకోవాల్సిన అవసరం అయితే లేదని చెప్పుకొచ్చారు.జీవితంలో మూవ్ ఆన్ అవుతూ ఉండాలని రష్మీ అన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube