సుధీర్ పెళ్లికి వచ్చిన రష్మీ... ఏడుస్తూ...

తెలుగులో ప్రముఖ ఎంటర్ టైన్ మెంట్ చానల్ అయినటువంటి ఈ టీవీ ఛానల్ లో ప్రతి గురు, శుక్రవారం రాత్రి 9.30 నిమిషాలకు ప్రసారమవుతున్న జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ కామెడీ షోలు బుల్లితెర ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుంటున్నాయో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.అయితే ఈ షోలో యాంకర్ గా వ్యవహరిస్తున్న అందాల భామ రష్మి గౌతమ్ మరియు ప్రముఖ కమెడియన్ సుడిగాలి సుదీర్ ల జోడి షోకే హైలెట్ గా నిలుస్తోంది.తాజాగా వచ్చే శుక్రవారం ప్రసారమయ్యే ఎపిసోడ్ ప్రోమో ను షో నిర్వాహకులు యూట్యూబ్ లో విడుదల చేశారు.

 Anchor Rashmi Gautam And Sudigali Sudheer Marriage News, Rashmi Gautam, Sudigali-TeluguStop.com

  దీంతో ఈ షోలో సుడిగాలి సుధీర్ మరియురష్మి గౌతమ్ల సన్నివేశాలను ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

అయితే ఇంతకీ విషయం ఏమిటంటే ఈ షో లో స్కిట్ లో భాగంగా సుడిగాలి సుదీర్ పెళ్లి చేసుకోబోతుంటాడు.

ఈ క్రమంలో తన గురించి ఇప్పటికే చాలా మందికి తెలియడంతో చాలా సార్లు పెళ్లిళ్లు ఆగిపోయాయని దీంతో తన గురించి అన్నీ తెలిసిన తన స్నేహితులను పెళ్ళికి పిలవకూడదని అనుకుంటాడు.అయినప్పటికీ తన స్నేహితులైన ఆటో రామ్ ప్రసాద్ మరియు గెటప్ శ్రీను పెళ్లికి వచ్చి ఎందుకు పెళ్లి పిలువ లేదంటూ నిలదీస్తారు.

దీంతో రోజా కలగజేసుకుని అన్నీ తెలిసిన మీలాంటి వాళ్ళని అస్సలు పక్కన పెట్టుకోకూడదని అంటూ సరదాగా సెటైర్ వేస్తుంది.

దీంతో ఆటో రామ్ ప్రసాద్ సుడిగాలి సుదీర్ ఈ స్టేజ్ కి రావడానికి రష్మి గౌతమ్ కూడా చాలా ఉపయోగపడిందని దీంతో ఆమెని ఉపయోగించుకుని సుడిగాలి సుధీర్ పెళ్లి చెడగొట్టాలని సుధీర్ పెళ్లి కి ఆహ్వానిస్తారు.

దీంతో ఈ సన్నివేశాలు ప్రస్తుతం సోషల్ మీడియా మాధ్యమాలలో తెగ వైరల్ అవుతున్నాయి.అంతేకాక మరికొందరైతే ఏకంగా సుడిగాలి సుధీర్ పెళ్లి కి వచ్చిన రష్మి గౌతమ్ అంటూ కామెంట్లు చేస్తూ తెగ వైరల్ చేస్తున్నారు.

ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం సుడిగాలి సుదీర్ ఒకపక్క ఈవెంట్లలో కమెడియన్ గా నటిస్తూనే మరో పక్క సినిమాల్లో హీరోగా కూడా నటిస్తూ బిజీ బిజీగా గడుపుతున్నాడు.ప్రస్తుతం సుడిగాలి సుదీర్ తెలుగులో “కాలింగ్ సహస్త్ర” అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు.

ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పనులు హైదరాబాద్ నగర పరిసర ప్రాంతంలో జరుగుతున్నాయి.ఇక రష్మి గౌతమ్ విషయానికొస్తే ఈ అమ్మడు కూడా ప్రస్తుతం హీరోయిన్గా వరుస చిత్రాలలో నటిస్తూ బిజిబిజీగా గడుపుతోంది.

కాగా ప్రస్తుతం యంగ్ హీరో నందు హీరోగా నటిస్తున్న బొమ్మ బ్లాక్ బస్టర్ అనే చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube