ప్రేమికులకు రష్మీ సలహా.. ప్రేమికుల రోజున అలా చేయొద్దంటూ..!

బుల్లితెర జబర్దస్త్ యాంకర్ రష్మీగౌతమ్ జబర్దస్త్ షో ద్వారా యాంకర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న సంగతి తెలిసిందే.యాంకర్ రష్మీకి మూగజీవాలంటే ఎంతో ప్రేమ అనే సంగతి కూడా తెలిసిందే.

 Anchor Rashmi Emotional Post On Valentines Day Gifts, Anchor Rashmi ,valentines-TeluguStop.com

చాలా సందర్భాల్లో సోషల్ మీడియా ద్వారా రష్మీ మూగజీవాలపై తనకు ఉన్న ప్రేమను చాటుకున్నారు.తిండి లేక ఇబ్బంది పడే మూగజీవాలకు సైతం పలు సందర్భాల్లో రష్మీ ఆహారం అందించారు.

మరికొన్ని రోజుల్లో వాలెంటైన్స్ డే రాబోతున్న సంగతి తెలిసిందే.సాధారణంగా వాలేంటైన్స్ డేకు ప్రేమికులు వాళ్లు ప్రేమించిన వాళ్లకు బహుమతులు ఇస్తూ ఉంటారు.కొంతమంది పెట్ డాగ్స్ ను కూడా బహుమతులుగా ఇస్తారు.అలాంటి వారికి రష్మీ సోషల్ మీడియా వాల్ పై చేసిన పోస్ట్ ద్వారా కీలక సూచన చేశారు.

ప్రేమికుల రోజున పెట్స్ ను గిఫ్ట్ గా ఇవ్వవద్దని.డాగ్స్ అనేవి కొన్ని రోజులు ఉండేవి కాదని 20 సంవత్సరాల పాటు ఉండేవని అన్నారు.

పెట్ డాగ్స్ ను గిఫ్ట్ గా ఇచ్చేముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలని పెట్ డాగ్స్ ను బహుమతిగా ఇచ్చిన తరువాత లవర్ తో బ్రేకప్ అయితే ఆ పెట్ డాగ్ ను రోడ్డుపై వదిలేస్తారని ఆమె అన్నారు.కొంతమంది బ్రేకప్ అయితే పెట్ డాగ్స్ ను పట్టించుకోవడం మానేస్తారని.

ప్రేమికుల రోజున పెట్ డాగ్స్ ను ఎవరూ బహుమతులుగా ఇవ్వవద్దని రష్మీ గౌతమ్ సూచనలు చేశారు.పెట్స్ ను గిఫ్ట్ లు గా ఇవ్వమంటూ చేస్తున్న ప్రకటనలను నమ్మవద్దని ఆమె అన్నారు.

మరోవైపు రష్మీ జబర్దస్త్ షోతో పాటు సినిమాల్లో కూడా నటిస్తున్నారు.ఆమె నటించిన బొమ్మ బ్లాక్ బస్టర్ సినిమా త్వరలో విడుదల కానుంది.

హీరోయిన్ గా గుంటూరు టాకీస్ మినహా సరైన సక్సెస్ లేని రష్మీ బొమ్మ బ్లాక్ బస్టర్ సినిమా హిట్ అయితే హీరోయిన్ గా వరుస ఆఫర్లతో బిజీ అయ్యే అవకాశం ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube