మళ్లీ కన్నీళ్లు పెట్టిన రష్మీ... ఈసారి మాత్రం?

బుల్లితెర యాంకర్ రష్మీ పరిచయం గురించి అందరికీ తెలిసిందే.జబర్దస్త్ లో యాంకరింగ్ తో బుల్లి తెరకు పరిచయమైన రష్మీ తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకుంది.

 Anchor Rashmi Again Very Emotional After Watching The Video, Anchor Rashmi, Emot-TeluguStop.com

కేవలం జబర్దస్త్ లోనే కాకుండా పలు షో లలో కూడా చేస్తుంది రష్మీ.వెండితెరపై పలు సినిమాలలో నటించగా అంత గుర్తింపు తెచ్చుకోలేదు.కానీ బుల్లితెరలో మాత్రం మంచి క్రేజ్ సంపాదించుకుంది.ఇక సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది.

రష్మీ తెర ముందు ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే.కానీ తెరవెనుకలా ఎంతో మానవత్వంను కలిగి ఉంటుంది.

సమాజం పట్ల బాగా స్పందిస్తుంది.బయట జరిగే నేరాలను అస్సలు తట్టుకోలేదు.

ఒక సెలబ్రిటీ హోదాను పక్కనపెట్టి అన్ని విషయాలలో బాధ్యత వహిస్తుంది రష్మీ.మానవ జాతి పట్ల చేసే కొన్ని వ్యతిరేక చేష్టలను అసలు ఊరుకోదు.

ఇక తనకు మూగజీవులు అంటే ఎంత ఇష్టం.వాటికి ఏమైనా జరిగితే వెంటనే రియాక్ట్ అవుతుంది.

ఇటీవలే తిరువనంతపురం బీచ్ దగ్గర బ్రూనో అనే కుక్కలు ముగ్గురు వ్యక్తులు కర్రలతో కొట్టి చేపల గేలానికి వేలాడదీసి దాన్ని హత్య చేశారు.ఇక దాని పట్ల మండిపడిన రష్మీ మానవత్వం పై సిగ్గేస్తుందని కోపంతో రగిలిపోయింది.

తాజాగా తన ఇన్ స్టా గ్రామ్ వేదికగా ఓ వీడియో షేర్ చేసుకుంది.ఆ వీడియోని చూసి ఎంతో ఎమోషనల్ అయింది రష్మీ.అందులో ఓ మూగ జీవి అయిన జలచరం తన తల్లి కనిపించకపోయేసరికి చాలాసేపు వెతికింది.

చివరికి తన తల్లి కనిపించేసరికి వెంటనే దాని దగ్గరికి వెళ్లి ముద్దాడింది.ఇక రష్మీ ఈ వీడియోని షేర్ చేస్తూ అలా తల్లిని చూసిన ఆ చిన్న జీవి ఎంతో సంతోషంగా ఉందని.అది చూడగానే తనకు ఏడుపు వచ్చేసిందని తెలిపింది.

అందరికీ ఉన్నట్టే వాటికి కూడా ఫీలింగ్స్ ఉంటాయని.మనం బతికేందుకు, రుచులు, కోరికలు తీర్చుకునేందుకు వాటిని చంపి తినడం వేరు అని తెలిపింది.

ఇకనైనా మనం మంచిగా బతుకుదాం ఎదుటి వాటిని బతుకనిద్దామని తెలిపింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube