వాష్ రూమ్ లో కూడా కెమెరాలు పెడతారా... నందు పై ఫైర్ అయిన రష్మీ?

తెలుగు బుల్లితెరపై యాంకర్ గా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న రష్మీ వెండితెరపై కూడా అప్పుడప్పుడు తన అదృష్టాన్ని పరీక్షించుకుంటూ ఉంటుంది.ఈ క్రమంలోనే సింగర్ గీతామాధురి భర్త నందు రష్మి గౌతమ్ కలిసిన నటించిన బొమ్మ బ్లాక్ బాస్టర్ అనే సినిమా నవంబర్ 4వ తేదీ విడుదలవుతోంది.

 Anchor Rashi Shocking Comments On Nandu Details,  Cameras, Washroom ,rashmi ,  N-TeluguStop.com

అయితే ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సి ఉండగా ఇలా చాలా సంవత్సరాల తర్వాత విడుదల కావడంతో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.ఈ సినిమా విడుదలకు చాలా తక్కువ సమయం ఉండడంతో ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా యాంకర్ రష్మీ గురించి ఒక ఫ్రాంక్ వీడియో చేయడంతో ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ సందర్భంగా నందు రష్మీకి ఫోన్ చేస్తే తాను లిఫ్ట్ చేయదని తను సినిమా ప్రమోషన్లకు కూడా రాదు అంటూ తాను ఉన్నచోటకే ఫోటోషూట్స్ కోసం మేము వచ్చాము అంటూ కామెంట్ చేశారు.ఇలా రష్మీ దగ్గర వీరు ఫ్రాంక్ చేయడంతో రష్మీ ఈ విషయంపై స్పందించి తాను సినిమా గురించి అడుగుతారని ప్రమోషన్లకు రాను అంటూ సమాధానం చెప్పారు.

అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈమె నందు ఫ్రాంక్ చేసినప్పటికీ తాను మాత్రం సీరియస్ గానే సమాధానం చెప్పానని తెలిపారు.

Telugu Anchor Rashmi, Cameras, Nandu, Rashmi, Rashmigautam, Washroom-Movie

నందు ఫ్రాంక్ చేస్తే నేను మాత్రం నిజంగానే సమాధానం చెప్పాను.ఇలా సడన్ గా ప్రమోషన్లకు పిలిస్తే ఎలా వస్తారు మేం కూడా టైం చూసుకోవాలి నా షెడ్యూల్స్ చూసుకోవాలి కదా? నేను వేరే షెడ్యూల్స్ లో ఉండి షూటింగులు జరుపుకుంటూ బిజీగా ఉంటే అక్కడికి కూడా వస్తే ఎలాగా? వీరికి అవకాశం ఇస్తే వాష్ రూమ్ లో కూడా కెమెరాలు పెట్టే లాగా ఉన్నారు అంటూ రష్మి గౌతమ్ చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube