ప్రదీప్ 30 రోజుల సినిమా ఓటిటి విడుదలను అడ్డుకుంటున్నది ఎవరు?

యాంకర్ ప్రదీప్ కు బుల్లి తెరపై సూపర్ స్టార్ క్రేజ్ ఉంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.ఈయన ఏ షో చేసినా కూడా సూపర్ హిట్.

 Anchor Pradeep30 Rojullo Preminchadam Ela Ott-TeluguStop.com

అందుకే ఈయనకు ఉన్న అభిమానుల సంఖ్య అంతా ఇంతా కాదు.గతంలో పలు సినిమాల్లో నటించిన ప్రదీప్ ఈసారి హీరోగా నటించాడు.30 రోజుల్లో ప్రేమించడం ఎలా అనే సినిమాతో హీరోగా ప్రదీప్ పరిచయం కాబోతున్నాడు.

ప్రదీప్ ఖచ్చితంగా హీరోగా సక్సెస్ ను దక్కించుకుంటాడు అంటూ అంతా నమ్మకంగా ఉన్న సమయంలో నీలి నీలి ఆకాశం పాట విడుదలై సినిమా పై అంచనాలను మరింతగా పెంచేసింది.

 Anchor Pradeep30 Rojullo Preminchadam Ela Ott-ప్రదీప్ 30 రోజుల సినిమా ఓటిటి విడుదలను అడ్డుకుంటున్నది ఎవరు-Movie-Telugu Tollywood Photo Image-TeluguStop.com

సినిమా కొన్ని రోజుల్లో విడుదల అవుతుంది అనుకుంటున్న సమయంలో కరోనా మొదలై మొత్తం ఆపేసింది.సినిమా విడుదల కూడా ఆగిపోయింది.సినిమా బిజినెస్ అంతా అయ్యింది.ప్రదీప్ కు ఉన్న క్రేజ్ తో సినిమా ను నిర్మాతలు పెట్టిన మొత్తం కంటే డబుల్ రేటుకు అమ్మేశారు.

థియేటర్లు ఇప్పట్లో ఓపెన్ అయ్యే పరిస్థితి కనిపించడం లేదు.దాంతో చాలా సినిమాలు ఓటిటి ద్వారా విడుదలకు సిద్ధం అవుతున్నాయి.ఇదే సమయంలో ప్రదీప్ సినిమాను కూడా ఓటిటి లో విడుదల చేస్తే బాగుంటుందని అంతా అనుకుంటున్నారు.అయితే ఓటిటి లో విడుదల చేయాలంటే సినిమాను కొనుగోలు చేసిన బయ్యర్ల కు మొత్తం డబ్బు వడ్డీ తో సహా చెల్లించాల్సి ఉంటుంది.

అంత మొత్తం చెల్లించడం ఇష్టం లేని నిర్మాత ఓటిటి విడుదలకు ఆసక్తి గా లేదని గుసగుసలు వినిపిస్తున్నాయి.ప్రదీప్ సినిమా ఓటిటి లో విడుదల ఉండక పోవచ్చు అనేది చాలా మంది అభిప్రాయం.

#Anchor Pradeep #30Rojullo #Lock Down #Pradeep #Coronavirus

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు