30 రోజుల్లో ప్రేమించడం ఎలా అంటున్న ప్రదీప్  

Anchor Pradeep Turned As A Hero Different Concept Movie-different Concept Movie,tollywood,turned As A Hero

తెలుగు టెలివిజన్ రంగంలో తిరుగులేని యాంకర్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి ప్రదీప్ మాచిరాజు.ఆర్జేగా కెరియర్ స్టార్ట్ చేసి తరువాత వీజేగా టెలివిజన్ లో అడుగుపెట్టి ఇప్పుడు నెంబర్ వన్ యాంకర్ గా తన ప్రస్తానం కొనసాగిస్తున్నాడు.

Anchor Pradeep Turned As A Hero Different Concept Movie-Different Movie Tollywood

ఇదిలా ఉంటే ప్రదీప్ ఎప్పటి నుంచో హీరోగా ఎంట్రీ ఇవ్వాలని ఆశ పడుతున్నారు.సినిమాలలో చిన్న చిన్న పాత్రలు చేసిన వాటిలో ఏవి తనకి నటుడుగా గుర్తింపు ఇవ్వలేకపోయాయి.

అయితే ఈ సారి ఎలా హీరోగా ఎంట్రీ ఇచ్చి ఆల్ రౌండర్ అనిపించు కోవడం కోసం ప్రయత్నం చేస్తున్నాడు.

ఈ నేపధ్యంలో డిఫరెంట్ టైటిల్ తో హీరోగా ప్రేక్షకుల ముందుకి రావడానికి రెడీ అయ్యాడు.

30 రోజుల్లో ప్రేమించటం ఎలా అనే రొమాంటిక్ కామెడీ మూవీతో ప్రదీప్ హీరోగా మారుతున్నారు.డైరెక్టర్ సుకుమార్ దగ్గర పలు సినిమాలకు దర్శకత్వ శాఖలో పనిచేసిన మున్నా అనే కుర్రాడు ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు.

ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్, మోషన్ పోస్టర్‌లను రానా దగ్గుబాటి ఆవిష్కరించారు.ఇదిలా ఉంటే ఈ పోస్టర్ లో ప్రదీప్ విలేజ్ గెటప్ లో కాస్తా డిఫరెంట్ గా ఉన్నాడు.

అమృత అయ్యర్‌ ఈ సినిమాలో ప్రదీప్ కి జోడీగా నటిస్తుంది.డిఫరెంట్ టైటిల్ తో వస్తున్నా ఈ సినిమాతో ప్రదీప్ హీరోగా ఎంత వరకు హిట్ కొట్టి తన మార్క్ చూపిస్తాడు అనేది చూడాలి.

తాజా వార్తలు