రెండవ సినిమా కోసం భారీ ఆఫర్‌.. హోల్డ్‌ లో పెట్టిన బుల్లి తెర స్టార్‌

బుల్లి తెర సూపర్‌ స్టార్‌ అంటూ ప్రదీప్‌ కు మంచి పేరు ఉంది.గతంలో పలు సినిమాల్లో నటించిన ప్రదీప్ కనీసం ఒక్కటి అంటే ఒక్క సినిమాతో కూడా గుర్తింపు దక్కించుకోలేదు.

 Anchor Pradeep Second Movie Updates-TeluguStop.com

అసలు ప్రదీప్ నటించిన సినిమాలు ఏంటీ అంటే ఠక్కున చెప్పడం కూడా కష్టం.అలాంటిది బుల్లి తెరపై సూపర్‌ స్టార్‌ ఇమేజ్‌ ను దక్కించుకున్న ప్రదీప్ ఇప్పుడు హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దం అయ్యాడు.

ఈయన 30 రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమాతో హీరోగా పరిచయం అయ్యేందుకు సిద్దంగా ఉన్నాడు.కాని సినిమా కరోనా కారణంగా మార్చి నుండి వాయిదా పడుతూ వస్తుంది.

ఆ సినిమా విడుదల విషయంలో క్లారిటీ లేదు.సినిమాకు విపరీతమైన హైప్‌ ఉంది.

కనుక థియేటర్లలో విడుదల చేస్తే భారీగా విజయాన్ని సొంతం చేసుకుంటుందనే నమ్మకం అందరిలో ఉంది.ప్రదీప్‌ మొదటి సినిమా విడుదల కాకున్నా కూడా హీరోగా చాలా ఆఫర్లు వస్తున్నాయి.

ఆయనకు భారీ పారితోషికం ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నారు.

Telugu Anchor Pradeep, Pradeep-Movie

ఒక ప్రముఖ నిర్మాణ సంస్థ ఆయనతో సినిమాను నిర్మించేందుకు ఫేమస్‌ డైరెక్టర్‌ ను పట్టుకుని వెయిట్ చేస్తుంది.కాని ప్రదీప్ మాత్రం మొదటి సినిమా విడుదల తర్వాతే తదుపరి సినిమా విషయమై నిర్ణయం తీసుకుంటాను అంటున్నాడట.వస్తున్న ఆఫర్లు అన్నింటిని కూడా హోల్డ్‌ లో పెట్టి ఆ తర్వాత నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నాడు.30 రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమా ఖచ్చితంగా సూపర్‌ హిట్‌ అవుతుంది.కనుక ఆ తర్వాత వరుసగా సినిమాలకు భారీ పారితోషికంతో కమిట్‌ అవ్వాలనే నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది.

ప్రస్తుతానికి ప్రదీప్ ఎలాగూ బుల్లి తెరపై సందడి చేస్తున్నాడు.కనుక థియేటర్లలో సినిమాలతో హడావుడి చేసేందుకు ఏమంత ఆతృత లేదు అన్నట్లుగా కామెంట్స్‌ వినిపిస్తున్నాయి.

త్వరలోనే ప్రదీప్‌ రెండవ సినిమా ప్రకటన రావాలని అభిమానులు కోరుకుంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube