బాలయ్య నిజస్వరూపం బయటపెట్టిన ప్రదీప్.. ఏం చెప్పారంటే..?

స్టార్ హీరో బాలకృష్ణకు కోపం ఎక్కువని చాలా సందర్భాల్లో వార్తలు రావడంతో పాటు కొన్నిసార్లు బాలకృష్ణ అభిమానులపై చేయి చేసుకున్న ఘటనలు కూడా ఉన్నాయి.అయితే బాలకృష్ణను దగ్గరినుంచి చూసిన వాళ్లు మాత్రం బాలయ్య చాలా మంచివారని చెబుతుంటారు.

 Anchor Pradeep Praises Balakrishna In Drama Juniors The Next Super Star Show-TeluguStop.com

తాజాగా ప్రముఖ బుల్లితెర మేల్ యాంకర్లలో ఒకరైన ప్రదీప్ బాలయ్య గురించి మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

బాలకృష్ణ తీరు కానీ, స్టైల్ కానీ సింహంలా ఉంటుందని ప్రదీప్ అన్నారు.

 Anchor Pradeep Praises Balakrishna In Drama Juniors The Next Super Star Show-బాలయ్య నిజస్వరూపం బయటపెట్టిన ప్రదీప్.. ఏం చెప్పారంటే..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రిలో లేదా ఇతర ఆస్పత్రులలో సహాయం కావాలంటే తాను మొదట బాలకృష్ణకే ఫోన్ చేస్తానని ప్రదీప్ అన్నారు.బాలకృష్ణ సహాయం కోరిన వెంటనే వేరేవాళ్లకు ఫోన్లు చేసి వైద్య చికిత్స అందే విధంగా చేశారని ప్రదీప్ చెప్పుకొచ్చారు.

బాలకృష్ణగారు సహాయం అవసరమైతే అర్ధరాత్రి అయినా కాల్ చేయమని చెప్పారని ప్రదీప్ తెలిపారు.

బాలకృష్ణ చెప్పిన ఆ మాట, బాలకృష్ణ ఇచ్చిన ధైర్యం చాలని ప్రదీప్ అన్నారు.

నటుడు బాలకృష్ణ గొప్పదనం గురించి ప్రదీప్ చెప్పకనే చెప్పేశారు.మరోవైపు ఈ నెల 10వ తేదీ వరకు అఖండ మూవీ షూటింగ్ జరగనుందని తెలుస్తోంది.

అఖండ షూటింగ్ పూర్తైన తర్వాత ఆ సినిమా చిత్ర నిర్మాతలు రిలీజ్ డేట్ గురించి కీలక ప్రకటన చేసే అవకాశాలు అయితే ఉంటాయని తెలుస్తోంది.

Telugu Balakrishna, Drama Juniors, Next Level Super Star, Pradeep Machiraju-Movie

మరోవైపు బుల్లితెర యాంకర్ ప్రదీప్ కు హోస్ట్ గా ఆఫర్లు పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదు.ఈటీవీ, జీటీవీ ఛానల్స్ లో ప్రధానంగా ప్రదీప్ హోస్ట్ చేస్తున్న షోలు ప్రసారమవుతున్నాయి.మరోవైపు ప్రదీప్ హీరోగా కూడా సినిమాలతో బిజీ అవుతున్న సంగతి తెలిసిందే.

ప్రదీప్ నటించి ఈ ఏడాది విడుదలైన 30 రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నా సంగతి తెలిసిందే.

#NextLevel #Drama Juniors #Balakrishna

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు