30 రోజుల్లో సినిమాకు ప్రదీప్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?

ప్రదీప్ మాచిరాజు తెలుగు ప్రేక్షకులకు ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు.బుల్లితెరపై పలు కార్యక్రమాలకు యాంకర్ గా చేస్తూ ఎంతో మంది ప్రేక్షకులను సంపాదించుకున్నాడు.

 Anchor Pradeep Remuneration For 30rojullo Preminchadam Ela Movie, 30rojullo Pre-TeluguStop.com

అదే విధంగా తన మాటమాట తీరుతో ఎంతో మందిని ఆకర్షించిన ప్రదీప్ కు బుల్లితెరపై ఎన్నో అవకాశాలు వెల్లువెత్తాయి.ఈ సందర్భంగానే బుల్లితెరపై మంచి విజయంతో దూసుకు వెళ్తున్న ప్రదీప్ కి ప్రముఖ హీరోల సినిమాలలో నటించే అవకాశం లభించింది.

ఈ విధంగా సినిమాలలో నటిస్తూ ఎంతోమందిని ఆకట్టుకున్న ప్రదీప్ కి హీరోగా వెండితెరపై కనిపించే అవకాశం కూడా రావడంతో” 30 రోజుల్లో ప్రేమించడం ఎలా”? అనే తెలుగు సినిమా ద్వారా ప్రేక్షకులకు పరిచయం అయ్యారు.
బుల్లితెరపై ఎంతో ఇమేజ్ ను సంపాదించుకున్న ప్రదీప్ టీవీ కార్యక్రమాలకు ఒక్కో ఎపిసోడ్ కి దాదాపు 50 వేల రూపాయల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటారని సమాచారం.

అలాంటి ప్రదీప్ ఇప్పుడు వెండితెరపై హీరోగా పరిచయం అవుతున్నారు అంటే భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ తీసుకుని ఉంటారని అందరూ భావిస్తున్నారు.కానీ ఈ సినిమాకు ప్రదీప్ తీసుకున్న రెమ్యునరేషన్ గురించి తెలిస్తే ప్రతి ఒక్కరు షాక్ అవుతారు.

ఇంతకీ ప్రదీప్ ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నారో తెలుసా.? ఈ సినిమాలో నటించినందుకు గాను ప్రదీప్ ఒక్క రూపాయి కూడా రెమ్యూనరేషన్ తీసుకోలేదు.

Telugu Anchor, Anchor Pradeep, Anchorpradeep, Pradeep-Movie

ఈ సినిమాలో హీరోగా అవకాశం రావడంతో ప్రదీప్ నిర్మాతతో ఈ విధంగా చెప్పారు.”సినిమా విడుదలై మంచి విజయాన్ని అందుకున్న తర్వాత, నిర్మాతలందరూ సేఫ్ అయ్యి, సినిమాకు లాభాలు వచ్చినప్పుడు రెమ్యూనరేషన్ తీసుకుంటానని” చెప్పారు.నా కోసం ఉపయోగించే డబ్బును మంచి టెక్నీషియన్లను పెట్టుకోమని చెప్పారంట.అందుకే ఈ సినిమాకు మంచి టెక్నీషియన్లు కుదిరారు.ఇక ఈ సినిమాలో” నీలి నీలి ఆకాశం “అనే పాట ఎంతో మంది ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టిందని చెప్పవచ్చు.ఈ సినిమాలో ఈ పాట ఒక్కటే 300 మిలియన్ వ్యూస్ సాధించింది.

ఒక చిన్న సినిమాలో పాటకు ఇన్ని వ్యూస్ రావడం అంటే ఎంతో గొప్ప విషయం అని చెప్పవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube