పాపం.. యాంకర్ ప్రదీప్ కి ఎంత కష్టం వచ్చింది?

ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో టాప్ యాంకర్ గా కొనసాగుతున్నాడు ప్రదీప్.ఒకప్పుడు గడసరి అత్త సొగసరి కోడలు అనే కార్యక్రమంతో జీ తెలుగులో యాంకర్ గా అవతారమెత్తిన ప్రదీప్ ఆ తర్వాత సొంత నిర్మాణంలో కొంచెం టచ్ లో ఉంటే చెప్తా అనే కార్యక్రమం తో ఒక్కసారిగా హిట్టయ్యాడు ఆ తర్వాత వరుస షోలూ యాంకర్ ప్రదీప్ దగ్గరికి క్యూ కట్టాయి.

 Anchor Pradeep New Shows Worst Ratings,anchor Pradeep, Dhee Show, Pradeep Remune-TeluguStop.com

ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో తిరుగులేని యాంకర్గా కొనసాగుతున్న సుమ తర్వాత ఆ రేంజ్ సంపాదించుకున్నది మాత్రం ప్రదీప్ అనే చెప్పాలి.ఇక కొంచెం టచ్ లో ఉంటే చెప్తా అనే కార్యక్రమం తర్వాత ప్రదీప్ చేసిన కొన్ని షోలు మాత్రమే హిట్ అయ్యాయి.
కొన్ని మాత్రం ఫట్ అనిపించాయి .సాధారణంగా ప్రదీప్ ఏదైనా షోకి యాంకరింగ్ చేస్తున్నాడంటే టాప్ రేటింగ్ సొంతం చేసుకోవడం ఖాయం అని నమ్ముతూ ఉంటారు.కానీ ఇటీవలి కాలంలో ప్రదీప్ యాంకరింగ్ చేస్తున్న ఎన్నో షోలు అంతగా రేటింగ్ సాధించడం లేదు.ఇక ప్రస్తుతం ప్రదీప్ యాంకరింగ్ చేస్తున్న ఢీ కార్యక్రమం మంచి రేటింగ్ సొంతం చేసుకుంది.

అయితే ఇది కేవలం ప్రదీప్ వల్లే కాదు.యాంకర్ రష్మీ సుధీర్ వల్ల వచ్చింది అని చెప్పాలి.

ఇక ఇప్పుడు వాళ్లు వెళ్లిపోయిన తర్వాత ఢీ షో రేటింగ్ ఒక్కసారిగా పడిపోయింది.అదే సమయంలో ఇక ప్రదీప్ చేస్తున్న సూపర్ క్వీన్ రేటింగ్ అయితే దారుణంగానే ఉంది అని చెప్పాలి.

Telugu Anchor Pradeep, Dhee Show, Pradeep, Queen Show-Movie

ఇటీవలే ఏకంగా 2.14 రేటింగ్ నమోదయింది.ఇది బుల్లితెరపై అత్యంత దారుణమైన రేటింగ్ అని చెప్పాలి.అదేంటి ప్రదీప్ షో లకు ఇంత తక్కువ రేటింగ్ రావడం ఏంటి.అని ఎంతో మంది ఆశ్చర్యపోతున్నారు.అయితే ఏదైనా షో కి యాంకర్ అదనపు బలం అవుతాడు తప్పా కేవలం యాంకర్ తోనే షో హిట్టవడం మాత్రం జరగదు అని అంటున్నారు విశ్లేషకులు.

అందుకే సూపర్ క్వీన్ కాన్సెప్ట్ లోనే ఏదో తేడా ఉందని.అందుకే యాంకర్ ప్రదీప్ తనవరకు ప్రయత్నిస్తున్నా షో కాన్సెప్ట్ రేటింగ్ మీద ప్రభావం చూపుతుంది అని అంటున్నారు విశ్లేషకులు.

ఏదేమైనా ప్రతి షో కి యాంకర్ తో పాటు కాన్సెప్ట్ కూడా అంతే ముఖ్యమైనదని ఇప్పుడు ప్రదీప్ షోలను చూస్తే అర్థమవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube