10 మిలియన్ క్లబ్ లో ప్రదీప్ సాంగ్! స్టార్ హీరోల రేంజ్

స్టార్ యాంకర్ గా తెలుగు టెలివిజన్ లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న వ్యక్తి ప్రదీప్ మాచిరాజు.అతి తక్కువ కాలంలోనే స్టార్ యాంకర్ గా ఎదిగిన ప్రదీప్ నటుడుగా కూడా చిన్న చిన్న పాత్రలు చేస్తున్నాడు.

 Anchor Pradeep Machineni Muppai Rojullo Preminchadam Yela-TeluguStop.com

అయితే ఎప్పటి నుంచో హీరోగా ప్రూవ్ చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్న ఇతను ఇప్పుడు తన సత్తా చాటడానికి 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకి రావడానికి రెడీ అయ్యాడు.సుకుమార్ శిష్యుడు మున్నా దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.

ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా నుంచి సిద్ శ్రీరామ్ ఆలపించిన నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్న అనే మెలోడీ సాంగ్ ప్రేక్షకుల ముందుకి వచ్చింది.

సిద్ శ్రీరామ్ పాడుతున్న సాంగ్స్ ఈ మధ్య కాలంలో సూపర్ హిట్ అవడంతో సినిమా మీద కూడా మంచి బజ్ క్రియేట్ చేస్తూ హిట్ టాక్ కి కారణం అవుతున్నాయి.

ఇప్పుడు అతని లిస్టు లో మరో సూపర్ సాంగ్ గా ఇది నిలిచింది.ఈ ఏడాదిలో ఈ మధ్యకాలంలో ఎక్కువగా వినిపిస్తున్న సాంగ్ ఇదే కావడం విశేషం.

చంద్రబోస్ లెరిక్స్ అందించిన ఈ సాంగ్ కి అనూప్ రూబెన్స్ స్వరాలు సమకూర్చారు.ఇక ఈ సాంగ్ యుట్యూబ్ లో రిలీజ్ అయ్యి వారం ఆరు రోజుల్లోనే ఏకంగా 10 మిలియన్ క్లబ్ లో చేరిపోయింది.

ఇప్పటి వరకు తెలుగులో స్టార్ హీరోల సినిమా సాంగ్స్, అది కూడా ఎంతో సూపర్ హిట్ అయితేనే ఈ స్థాయిలో క్రేజ్ వస్తుంది.ఇప్పుడు ప్రదీప్ సినిమా సాంగ్ కి కూడా క్రేజ్ రావడంతో చిత్ర యూనిట్ ఫుల్ ఖుషీగా ఉంది.

ఇక ఈ ఒక్క సాంగ్ తో ప్రదీప్ సినిమా మీద కూడా మంచి బజ్ క్రియేట్ అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube