బుల్లితెరపై మేల్ యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో ప్రదీప్ ( Pradeep ) మాచిరాజు ఒకరు.ఈయన స్టార్ యాంకర్ గా ఇండస్ట్రీలో కొనసాగుతూ ఎన్నో అద్భుతమైన కార్యక్రమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
ఇలా జీ తెలుగు ఈటీవీలో ప్రసారమయ్యే కార్యక్రమాలలో ఎంతో బిజీగా గడుపుతూ ఉన్నటువంటి ప్రదీప్ ఇటీవల కాలంలో ఈయన బుల్లితెర కార్యక్రమాలకు దూరమయ్యారు ఏ టీవీ ఛానల్ లోనూ ఈయన ప్రస్తుతం కనిపించడం లేదు.
ఈ విధంగా ప్రదీప్ బుల్లితెర కార్యక్రమాలలో కనిపించకపోవడంతో ఈయన బుల్లితెరకు దూరమయ్యారా ఇకపై యాంకర్ ( Anchor ) గా ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పారా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.ఇలా యాంకర్ గా ఈయన ఇండస్ట్రీకి దూరం అయినటువంటి తరుణంలో ప్రదీప్ కి సంబంధించి ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇందులో భాగంగా ఈయన పెద్ద ఎత్తున వర్కౌట్స్ చేస్తూ తెగ కష్టపడుతున్నారు.
కండలు తిరిగిన శరీరంతో ప్రదీప్ ఈ వీడియోలో కనిపించే సందడి చేశారు.ఇలా భారీ స్థాయిలో వర్కౌట్ చేస్తూ యాంకర్ ప్రదీప్ అందరికీ ఒక్కసారిగా షాక్ ఇచ్చారు.ఇక ఈ వీడియో కనుక చూస్తుంటే ప్రదీప్ యాంకర్ గా ఇండస్ట్రీకి దూరమైనప్పటికీ వెండితెరపై హీరోగా సందడి చేయడం కోసం సిద్ధమవుతున్నారని తెలుస్తుంది.ఈయన తన తదుపరి సినిమా కోసమే ఇలా వర్కౌట్ చేస్తూ తన మేకోవర్ మార్చుకుంటున్నారని తెలుస్తోంది.
ఇప్పటికే ప్రదీప్ 30 రోజులలో ప్రేమించడం ఎలా( 30 Rojullo Preminchadam Ela ) అనే సినిమా ద్వారా హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.ఈ సినిమా ద్వారా పరవాలేదు అనిపించుకున్నటువంటి ప్రదీప్ తదుపరి సినిమాని ప్రకటించలేదు అయితే ఈయన తన సినిమా కోసమే బుల్లితెరకు బ్రేక్ ఇచ్చారని తెలుస్తోంది.