మరో వివాదంలో చిక్కుకున్న యాంకర్ ప్రదీప్..!

యాంకర్ ప్రదీప్ మరో వివాదంలో చిక్కుకున్నాడు.టీవీ ఆన్ చేస్తే ఏదో ఒక షోలో కనిపించి తన యాంకరింగ్ తో అలరించే ప్రదీప్ అప్పుడప్పుడు వివాదాల్లో కూడా చిక్కుకుంటాడు.

 Anchor Pradeep Issue On Ap Capital-TeluguStop.com

లేటెస్ట్ గా ఓ షోలో భాగంగా ఏపీ రాజధాని వైజాగ్ అనేసి ఏపీ ప్రజలకు కోపం వచ్చేలా చేశాడు.దీనిపై ఏపీ పరిరక్షణ సమితి సభ్యులు సీరియస్ అవుతున్నారు.

కోర్ట్ లో ఉన్న అంశాల గురించి షోలో ఇలా మాట్లాడటం ఏమాత్రం కరెక్ట్ కాదని అంటున్నారు.యాంకర్ ప్రదీప్ వెంటనే ఆ వ్యాఖ్యలు వెనక్కి తీసుకుని క్షమాపణలు చెప్పాలని కోరుతున్నారు ఏపీ పరిరక్షణ సమితి.

 Anchor Pradeep Issue On Ap Capital-మరో వివాదంలో చిక్కుకున్న యాంకర్ ప్రదీప్..-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఒకవేళ అలా చేయకుంటే హైదరాబాద్ లో ప్రదీప్ ఇంటిని ముట్టడిస్తామని కూడా చెబుతున్నారు ఏపీ పరిరక్షణ సమితి సభ్యులు.

ఎరక్కపోయి వచ్చాను ఇరుక్కుపోయాను అన్నట్టుగా అయ్యింది ప్రదీప్ పరిస్థితి.

మధ్యనే కరోనా వల్ల తన తండ్రిని కోల్పోయిన ప్రదీప్ తెలియకుండానే ఈ ఇష్యూలో చిక్కుకున్నాడు.ఏపీ పరిరక్షణ సమితి సభ్యులు మాత్రం ఈ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకున్నారు.

అయితే ప్రదీప్ వీరి సారీ చెప్పి వివాదానికి ఫుల్ స్టాప్ పెడతాడో లేదో చూడాలి.ఈ వివాదంపై ప్రదీప్ స్పందన గురించి అందరు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

#Pradeep #Anchor Praeep #Reality Show #AP Capital #Pradeep Anchor

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు