బాలీవుడ్‌ స్టార్స్ సెంటిమెంట్‌ యాంకర్ ప్రదీప్‌ కు వర్కౌట్‌ అయ్యేనా?

తెలుగు బుల్లి తెరకు చెందిన చాలా మంది వెండి తెరపై సత్తా చాటేందుకు ప్రయత్నాలు చేశారు.వెండి తెరపై నుండి వెళ్లిన వారు బుల్లి తెరపై సందడి చేసిన దాఖలాలు చాలా ఉన్నాయి.

 Anchor Pradeep First Movie 30 Rojullo Preminchadam Ela Public Talk-TeluguStop.com

కాని బుల్లి తెర నుండి వెండి తెరపైకి వచ్చిన వారు అతి తక్కువ మంది ఉన్నారు.వారు కూడా సక్సెస్‌ లు దక్కించుకున్నట్లుగా పెద్దగా సందర్బాలు ఏమీ లేవు.

కాని ఉత్తరాది బుల్లి తెర స్టార్స్ చాలా మంది బాలీవుడ్‌ లో ఒక వెలుగు వెలుగుతున్నారు.ఎంతో మంది స్టార్స్‌ కూడా బుల్లి తెర నుండి వచ్చిన వారే అనడంలో సందేహం లేదు.

 Anchor Pradeep First Movie 30 Rojullo Preminchadam Ela Public Talk-బాలీవుడ్‌ స్టార్స్ సెంటిమెంట్‌ యాంకర్ ప్రదీప్‌ కు వర్కౌట్‌ అయ్యేనా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అద్బుతమైన బాలీవుడ్‌ స్టార్స్‌ కొందరు బుల్లి తెరకు చెందిన వారే.కాని బుల్లి తెర నుండి వచ్చిన వారు మాత్రం టాలీవుడ్ లో హీరోలుగా ఘనత సాధిస్తున్న దాఖలాలు కనిపించడం లేదు.

దాంతో యాంకర్‌ ప్రదీప్‌ విషయంలో అనేక అనుమానాలు అయితే నెలకొన్నాయి.బుల్లి తెరపై స్టార్స్ గా గుర్తింపు దక్కించుకున్న వారు మన వెండి తెరపై హిట్‌ లు అందుకోలేదు.

నేడు 30 రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ప్రదీప్ కు మిశ్రమ స్పందన అయితే వస్తుంది.ఒకటి రెండు రోజులు అయితే కాని సినిమా పూర్తి ఫలితంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

ప్రదీప్‌ సినిమా లు ఆడుతాయా లేదా అనేది ముందు ముందు తెలిసే అవకాశం ఉంది.అయితే ఆయకు తెలుగు బుల్లి తెర స్టార్స్ సెంటిమెంట్‌ వర్కౌట్‌ అయితే ఖచ్చితంగా హీరోగా ఆయన ముందుకు వెళ్లడం కాస్త ఇబ్బందే.

కాని బాలీవుడ్‌ బుల్లి తెర స్టార్స్ సెంటిమెంట్ వర్కౌట్‌ అయితే ఖచ్చితంగా వెండి తెరపై స్టార్‌ హీరోగా నిలిచే అవకాశం ఉందని అంటున్నారు.బుల్లి తెరపై సూపర్‌ స్టార్ ఇమేజ్ ను ఇప్పటికే కలిగి ఉన్న ప్రదీప్‌ సినిమాల్లో కూడా ఆ రేంజ్ క్రేజ్ ను దక్కించుకుంటే ఖచ్చితంగా మరో రేంజ్‌ లో ఆయన కెరీర్‌ ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

.

#Anchor Pradeep #30Rojullo #Etv Pradeep

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు