ప్రదీప్‌కు బిగుసుకున్న ఉచ్చు... ‘పెళ్లి చూపులు’ విజేత పెళ్లి చేసుకోమంటూ కోర్టు, ఉక్కిరిబిక్కిరవుతున్న ప్రదీప్‌?     2019-01-11   11:03:50  IST  Ramesh Palla

బుల్లి తెర స్టార్‌గా గుర్తింపు దక్కించుకున్న ప్రదీప్‌ ఆమద్య ‘పెళ్లి చూపులు’ అనే షోను నిర్వహించిన విషయం తెల్సిందే. ఆ షో ప్రారంభంకు ముందు ఆ షో ద్వారా ఒక అమ్మాయిని ఎంపిక చేసుకుని పెళ్లి చేసుకోబోతున్నట్లుగా తెగ హడావుడి చేశాడు. తీరా అది కేవలం అంతా రియాల్టీ షో మాత్రమే అంటూ తేల్చి చెప్పారు. గతంలో హిందీలో రాకీ సావంత్‌ షోకు, తమిళంలో ఆర్య చేసిన షోలకు ఇది కాపీ అంటూ నిర్వాహకులు చెప్పుకొచ్చారు. షోపై భిన్న తరహాలో విమర్శలు రావడంతో ఆ షోను మద్యలోనే ఆపేయలేక, ముగిసి పోయిందంటూ అసంపూర్తిగా ముగింపు ఇచ్చారు.

Anchor Pradeep Facing Problems With Pelli Choopulu Show Winner-Court Case Jnaneswari Pelli Winner

Anchor Pradeep Facing Problems With Pelli Choopulu Show Winner

‘పెళ్లి చూపులు’ ఫైనల్‌ విజేతగా జ్ఞానేశ్వరి అనే అమ్మాయి నిలిచింది. ప్రదీప్‌ అంటే పిచ్చి ప్రేమతో ఆమె చేసిన పనులు అన్నీ ఇన్నీ కావు. తోటి పార్టిసిపెంట్స్‌తో ఆమె తలబడ్డ తీరు మామూలు విషయం కాదు. 14 మంది అమ్మాయిలను ఈ షోకు తీసుకు వచ్చారు. అందులో ప్రతి ఒక్కరు కూడా ప్రదీప్‌ అంటే పిచ్చి ప్రేమ ఉన్న వారే. ప్రదీప్‌ కోసం ఎంతో మంది ప్రయత్నాలు చేస్తుంటే ఆ 14 మందికి ఆ షోలో ఛాన్స్‌ దక్కింది. అలాంటి వారిలో ఒకరిని ప్రదీప్‌ చేసుకుంటాడని అంతా అనుకున్నారు. కాని ప్రదీప్‌ మాత్రం షో అంతా అయిన తర్వాత జస్ట్‌ లైట్‌ అన్నాడు.

Anchor Pradeep Facing Problems With Pelli Choopulu Show Winner-Court Case Jnaneswari Pelli Winner

ప్రదీప్‌తో పెళ్లి అంటూ షో నిర్వాహకులు తమను మోసం చేశారని, షోలో గెలిస్తే ప్రదీప్‌ను పెళ్లి చేసుకునే అవకాశం అంటూ చెప్పడం వల్లే తాను చాలా కష్టపడి ఆ కార్యక్రమంలో పాల్గొన్నాను అంది జ్ఞానేశ్వరి. కాని చివరకు షో నిర్వాహకులు కాని, ప్రదీప్‌ కాని తనకు ఏ సమాధానం చెప్పకుండా మొహం చాటేశారంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ప్రదీప్‌ ఇచ్చిన మాట ప్రకారం తనను వివాహం చేసుకోవాలంటూ ఆదేశించాలని జ్ఞానేశ్వరి కోర్టుకు వెళ్లేందుకు సిద్దం అవుతుందట. అందుకోసం చర్చలు జరుపుతున్నట్లుగా సమాచారం అందుతోంది. మొత్తానికి కెరీర్‌ మంచి పీక్స్‌లో ఉన్న సమయంలో ఇలా దారుణమైన పరిస్థితిని ఎదుర్కోవడంతో ప్రదీప్‌కు ఏం చేయాలో పాలుపోవడం లేదట. ఒకవేళ జ్ఞానేశ్వరి కోర్టుకు వెళ్తే మాత్రం ప్రదీప్‌ కెరీర్‌ ఇబ్బందుల్లో పడ్డట్లే. చూడాలి ముందు ముందు ఏం జరుగుతుందో..!