మీడియా ముందుకు వచ్చిన ప్రదీప్‌, మేము చెప్పిందే నిజం అయ్యింది  

Anchor Pradeep Comes In Front Of Media - Telugu Anchor Pradeep, Pradeep In Small Accident, Pradeep Suffer From Dengue Fever, Pradeep Suffer From Health Issue

యాంకర్‌ ప్రదీప్‌ నెల రోజులుగా కనిపించడం లేదు.అతడు ఏమయ్యాడు అంటూ అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

Anchor Pradeep Comes In Front Of Media

ప్రదీప్‌కు బుల్లి తెర సూపర్‌ స్టార్‌ అంటూ పేరు ఉంది.అలాంటి ప్రదీప్‌ కనిపించకుండా పోయేప్పటికి అంతా కూడా ఏమైంది ఏమైంది అంటూ రకరకాలుగా ఊహించేసుకుంటున్నారు.

ప్రదీప్‌ హోస్టింగ్‌ చేస్తున్న పలు షోలు రేటింగ్‌లు పడిపోవడంతో పాటు ఛానెల్స్‌ కూడా ప్రదీప్‌ లేక పోవడంతో పలు కార్యక్రమాలను రద్దు చేస్తున్నాయి.

యాంకర్‌ ప్రదీప్‌కు డెంగ్యూ ఫీవర్‌ అంటూ ప్రచారం జరిగింది.యాంకర్‌ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాడు అంటూ వార్తలు వచ్చాయి.కాని మేము కొన్ని రోజుల క్రితం మాకు అందిన సమాచారం ప్రకారం డెంగ్యూ ఫీవర్‌ కాదని చిన్న యాక్సిడెంట్‌ అంటూ ఒక వార్తను ప్రచురించాం.

తాజాగా మీడియా ముందుకు వచ్చిన ప్రదీప్‌ అసలు ఏమైంది అనే విషయాన్ని క్లారిటీ ఇచ్చాడు.డెంగ్యూ ఫీర్‌ రాలేదు నాకేం పెద్ద అనారోగ్యం లేదు అంటూ చెప్పుకొచ్చాడు.

కొన్ని రోజుల క్రితం షో నిర్వహిస్తుండా యాక్సిడెంటల్‌గా చిన్న ప్రమాదం జరిగిందని, దాంతో కాలికి ప్యార్చర్‌ అయ్యింది.ఆ కారణంగానే షోలకు నెల రోజులు దూరంగా ఉన్నాను.మరో రెండు వారాల్లో కెమెరా ముందుకు వస్తానంటూ హామీ ఇచ్చాడు.ఇన్ని రోజులు మీడియా ముందుకు రాకపోవడంపై కూడా స్పందించాడు.పూర్తి బెడ్‌ రెస్ట్‌ ఉండటం వల్ల మీడియాకు కూడా దూరంగా ఉంటూ వచ్చానంటూ ప్రదీప్‌ పేర్కొన్నాడు.మొత్తానికి ప్రదీప్‌ తన అభిమానులకు క్లారిటీ ఇచ్చి ఊపిరి పీల్చుకునేలా చేశాడు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు