రాజుగారి గది 4 స్క్రిప్టు రెడీ: ఓంకార్

ప్రముఖ టీవీ యాంకర్ ఓంకార్.ఇప్పటివరకు తన సొంత క్రియేటివిటీతో రియాలిటీ షో లను రూపొందించి తానే స్వయంగా యాంకరింగ్ చేసి బుల్లితెర స్టార్ యాంకర్ గా మారాడు.అంతేకాకుండా వెండితెరపై దర్శకత్వం కూడా వహిస్తున్నాడు.ఇప్పటికే పలు సినిమాలలో దర్శకత్వం వహించగా.జీనియస్ అనే సినిమాతో తొలిసారిగా దర్శకుడిగా పరిచయమయ్యాడు ఓంకార్.ఇక ఆ తర్వాత రాజు గారి గది సినిమాలో దర్శకత్వం వహించగా తాజాగా రాజుగారి గది 4 తో ముందుకు రానున్నాడు.

 Anchor Ohmkar Working On Raju Gari Gadhi 4-TeluguStop.com

2015లో ఓంకార్ దర్శకత్వంలో విడుదలైన సినిమా రాజుగారిగది.ఈ సినిమా హర్రర్ కామెడీగా తెరకెక్కింది.

ఇక ఈ సినిమాలో ఓంకార్ సోదరుడు అశ్విన్ నటించగా ఈ సినిమా మంచి సక్సెస్ అందుకుంది.ఇక ఆ తర్వాత ఈ సినిమా సీక్వెల్ గా 2017 రాజు గారి గది 2 తో తెరకెక్కించగా అది కూడా మంచి సక్సెస్ అందుకుంది.

 Anchor Ohmkar Working On Raju Gari Gadhi 4-రాజుగారి గది 4 స్క్రిప్టు రెడీ: ఓంకార్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇక 2019లో రాజుగారి గది 3 తో ప్రేక్షకుల ముందుకు రాగా ఈ సినిమా అంత సక్సెస్ ను అందుకోలేదు.

తాజాగా రాజు గారి గది 4 ముందుకు రానుందని తెలుస్తుంది.ఇక ఈ సినిమా కథ కూడా రెడీగా ఉందని ఓంకార్ తెలిపాడు.ఇక కొన్ని విషయాలను పంచుకున్న ఓంకార్ కరోనా కారణంగా దాదాపు ఏడాదిన్నర నుండి సినిమాలు చేయటం లేదని తెలిపాడు.

ఒకవేళ ఇప్పుడు సినిమాలు చేసినా కూడా ఎప్పుడు విడుదలవుతుందో ఎవరికీ తెలియదు అని అన్నాడు.ఇక ముందుల థియేటర్ లలో సినిమాలు విడుదలయ్యే రోజులు వచ్చినప్పుడే సినిమా మొదలు పెట్టాలని అనుకుంటున్నాడట.

ఇక ఈ సినిమాతో పాటు మరో ప్రాజెక్టు కూడా చేయనున్నట్టు తెలిపాడు ఓంకార్.ఆ ప్రాజెక్టు క్రీడా నేపథ్యంలో ఉంటుందని తెలిపాడు.అంతే కాకుండా మరో థ్రిల్లర్ సబ్జెక్ట్ కూడా ఉంటుందని తెలిపాడు.ఇక ఈ మూడు కథలతో పాటు మరో కథను గ్రామీణ నేపథ్యంలో చేయాలనే ఆలోచన ఉందని తెలిపాడు ఓంకార్.

ఇక రాజుగారి గది సినిమాకంటే ముందే మరో సినిమా చేయాలని అనుకున్నాడట.కానీ ప్రస్తుతం పరిస్థితుల వల్ల విరామం రావడంతో మరో రియాలిటీ షో చేస్తున్నట్లు తెలిపారు.

ఇక తన సినిమా గురించి పూర్తి వివరాలు త్వరలోనే తెలుపుతానని తెలిపాడు.

#AnchorOmkar #Anchor Ohmkar #Anchor Omkar #Omkar Movies #Omkar Interview

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు