భర్త నా మాట వినకపోతే ఆ పని చేస్తా.. లాస్య కామెంట్స్ వైరల్?

బుల్లితెరపై హోమ్లీ యాంకర్ ఇమేజ్ ను సంపాదించుకున్న యాంకర్లలో లాస్య ఒకరు.కొన్నేళ్ల పాటు వరుస షోలతో బిజీగా ఉన్న లాస్య పెళ్లి తరువాత కొంతకాలం టీవీ షోలకు దూరంగా ఉన్నారు.

 Anchor Lasya Shocking Comments On Her Husband Manjunath In Sixth Sense Show-TeluguStop.com

బిగ్ బాస్ షో సీజన్ 4లో పాల్గొని ఇతర కంటెస్టెంట్లకు గట్టి పోటీని ఇచ్చిన లాస్య టాప్ 5 కంటెస్టెంట్ల జాబితాలో మాత్రం చోటు సంపాదించుకోలేకపోయారు.బిగ్ బాస్ షో తర్వాత లాస్య స్టార్ మా ఛానల్ లో ప్రసారమవుతున్న కొన్ని ప్రోగ్రామ్స్ లో పాల్గొంటూ సందడి చేస్తున్నారు.

తాజాగా లాస్య తన భర్త మంజునాథ్ తో కలిసి స్టార్ మా ఛానెల్ లో ప్రసారమవుతున్న సిక్స్త్ సెన్స్ షోకు హాజరయ్యారు.వీళ్లతో పాటు ప్రముఖ కొరియోగ్రాఫర్ యశ్, అతని భార్య సిక్స్త్ సెన్స్ షోకు హాజరయ్యారు.

 Anchor Lasya Shocking Comments On Her Husband Manjunath In Sixth Sense Show-భర్త నా మాట వినకపోతే ఆ పని చేస్తా.. లాస్య కామెంట్స్ వైరల్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

తాజాగా ఈ షోకు సంబంధించిన ప్రోమో రిలీజ్ కాగా లాస్య, మంజునాథ్ డ్యాన్స్ స్టెప్పులు అద్భుతంగా వేసి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు.ఓంకార్ లాస్య, మంజునాథ్ లలో ఎవరి మాట ఎవరు ఎక్కువగా వింటూ ఉంటారని ప్రశ్నించారు.

ఆ ప్రశ్నకు లాస్య సమాధానం ఇస్తూ సుత్తి పట్టుకుని తెలియనిది ఏముంది అన్నా అంటూ సమాధానం ఇచ్చారు.ఇక్కడైతే సుత్తి చూపిస్తున్నావ్ ఇంట్లో అయితే ఏం చూపిస్తావ్ అని ఓంకార్ అడగగా మంజునాథ్ లాస్య ఏది ఉంటే అది చూపిస్తుందంటూ సమాధానమిచ్చారు.భర్త తన మాట వినకపోతే అలిగి వెళ్లిపోతానని అలకతో నాకు కావాల్సినవి అన్నీ సాధించుకుంటానని లాస్య చెప్పుకొచ్చారు.

నా మాట వింటావా.? వినవా.? అని మంజునాథ్ లాస్యను అడగగా విననని సమాధానం లాస్య సమాధానం చెబుతారు.లాస్య, మంజునాథ్ షోలో సరదాగా కనిపించిన తీరు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.ఈ వీకెండ్ లో ఎపిసోడ్ ప్రసారం కానుండగా ఈ ఎపిసోడ్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తుండటం గమనార్హం.

#Manjunath #LasyaManjunath #Maa #Anchor Omkar #Lasya Manjunath

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు