ఆ విషయంలో దేవుడికి థాంక్స్ అంటున్న యాంకర్ లాస్య..!  

బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 కంటెస్టెంట్ యాంకర్ లాస్య యూట్యూబ్ లో ఒక సంచలనం గా ఎదుగుతున్నారు.బిగ్ బాస్ నుంచి ఆమె అడుగు బయట పెట్టిన అనంతరం తన యూట్యూబ్ ఛానల్ అయిన “లాస్య టాక్స్” కి ఫాలోవర్స్ విపరీతంగా పెరిగిపోయారు.

TeluguStop.com - Anchor Lasya Says Thanks To Audience

ఆమె పెట్టిన ప్రతి ఒక్క వీడియోకి లక్షల్లో వీక్షణలు వస్తున్నాయి.బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయిన ప్రతి ఒక్కరి ఇంటికెళ్లి ఆమె ఇంటర్వ్యూ చేస్తూ యూట్యూబ్ టాప్ ట్రెండింగ్ లిస్టులో చాలా సార్లు నిలిచారు.

అలాగే తన కుటుంబ సభ్యులకు, ముఖ్యం గా తన తనయుడు జున్ను కి సంబంధించిన వీడియోలను కూడా పెడుతూ బాగా ప్రజాదరణ పొందుతూ ఉన్నారు.
మోనాల్ గజ్జర్, జున్ను లతో ఒక వీడియో చిత్రీకరించి 10 లక్షల వీక్షణలను పొందారు.

TeluguStop.com - ఆ విషయంలో దేవుడికి థాంక్స్ అంటున్న యాంకర్ లాస్య..-General-Telugu-Telugu Tollywood Photo Image

అయితే యూట్యూబ్ ద్వారా బాగా డబ్బులు సంపాదిస్తున్న లాస్య ఛానల్ పై సైబర్ నేరగాళ్లు కన్నేశారు.ఆమె యూట్యూబ్ ఛానల్ ని హ్యాక్ చేశారు. 8 లక్షల మంది సబ్స్క్రైబర్లు ఉన్న తన ఛానల్ హ్యాక్ కి గురయిందని తెలిసిన లాస్య బాగా బాధపడిపోయారు.సోషల్ మీడియా వేదికగా ఒక వీడియో పోస్ట్ చేసి తన ఛానల్ హ్యాక్ కి గురైందని.

చాలా బాధ పడుతూ.తమ టీమ్ చానల్ ని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారని చెప్పుకొచ్చారు.

అయితే కొద్ది గంటల్లోనే చాలా మంది పరిచయస్తులు నిర్విరామంగా పని చేసి చానల్ ని బ్యాక్ రప్పించారు.వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి తిరుపతి వెళ్లిన లాస్య కి ఫోన్ చేసి ఛానల్ బ్యాక్ వచ్చేసింది అని చెప్పగా ఆమె చాలా సంతోషించారట.ఛానల్ మళ్లీ బ్యాక్ వచ్చేసింది అని ఆమె ఒక వీడియో పెట్టి తన ఫాలోవర్స్ కి తెలిపారు.అలాగే దర్శనం అయిపోయిన వెంటనే ఒక లైవ్ సెషన్ పెడతానని ఆమె అన్నారు.

అంతేకాదు మరొక వీడియోలో ఘల్ ఘల్ అనే పాటకు డాన్స్ స్టెప్పులు వేస్తూ తన ఆనందాన్ని వ్యక్తపరిచారు.అలాగే తనపై ప్రేమ ఆప్యాయతలు కురిపిస్తున్న తన అభిమానులకు ఆమె కృతజ్ఞతలు తెలుపుకున్నారు.

యూట్యూబ్ ఛానల్ హ్యాక్ అయ్యింది అన్న విషయం తెలియగానే చాలా మంది ధైర్యం చెప్పారని ఆమె అన్నారు.వారందరికీ తాను రుణపడి ఉంటానని ఆమె చెప్పుకొచ్చారు.

#Youtube Channel #Social Media #Instagram #Hacked #AnchorLasya

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Anchor Lasya Says Thanks To Audience Related Telugu News,Photos/Pics,Images..