నేను కూడా మీటూ బాధితురాలనే అంటున్న లాస్య

ఏ రంగంలో అయినా ఒంటరి ఆడవాళ్ళ మీద వేధింపులు సర్వ సాధారణంగా జరుగుతూ ఉంటాయి.మగవాళ్ళు అందమైన ఆడవాళ్ళు కనిపిస్తే వారిని ఎలా సొంతం చేసుకోవాలా అని చూస్తూ ఉంటారు.

 Anchor Lasya Open Up On Women Harassment In Industry, Tollywood, Metoo, Celebrit-TeluguStop.com

ఇక రంగుల ప్రపంచంలో అయితే ఇది మరీ ఎక్కువగా ఉంటుంది.సెలబ్రిటీ అవుదామని గడపదాటి బయటకొచ్చిన ప్రతి మహిళని కామంతో చూసే సమాజం మన చుట్టూ ఉంది.

అలంటి సమాజంలో కూడా తమ లక్ష్యాలని నెరవేర్చుకోవడానికి వేధింపులని ధైర్యంగా ఎదుర్కొంటూనే చాలా మంది మహిళలు ముందడుగు వేస్తున్నారు.సెలబ్రిటీలు అంటూ వారు అన్నింటికీ రెడీ అయ్యి ఉంటారు.

డబ్బులిస్తే పక్కలోకి వస్తారనే అభిప్రాయం చాలా మందిలో ఉంది.ఈ కారణంగా సినిమా, టీవీ రంగంలో ఉండే ఆడవాళ్ళకి ఇంకా వేధింపులు ఎక్కువగా ఉంటాయి.

ఇలాంటి వేధింపులకి వ్యతిరేకంగా గళం విప్పేందుకు మీటూ ఉద్యమం ద్వారా చాలా మంది సెలబ్రిటీలు ముందుకొచ్చారు. హాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు చాలా మంది అందాల భామలు తమకి ఎదురయిన అనుభవాలని మీడియాతో పంచుకున్నారు.
తాజాగా యాంకర్ లాస్య కూడా తన జీవితంలో ఎదురైన అనుభవాలని పంచుకుంది.ఉన్నతమైన స్థాయిలో న్యూజెర్సీ లో స్థిరపడిన ఒక వ్యక్తి నాకు ఫోన్ చేసి తనతో చాలా పచ్చిగా అడిగాడు.

నేను కుదరదు చెప్పేసాను అని లాస్య తెలిపింది.నాతో పెద్ద పెద్ద యాంకర్స్ పడుకున్నారు నువ్వెంత ఆఫ్ట్రాల్ అని తనతో మాట్లాడాడని, దాంతో పట్టరాని కోపం వచ్చిందని లాస్య తెలిపింది.

ఈవెంట్స్ కోసం వచ్చిన హీరోయిన్లు అక్కడ కాసేపు మాత్రమే ఉంటారు.ఆ తర్వాత హోటల్ రూమ్ కి వెళ్ళిపోతారు.అప్పటి నుంచి వాళ్లని చాలా మంది సీక్రెట్ గా కలుస్తున్నారని లాస్య తెలిపింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube