రెండు పెళ్లిళ్లు చేసుకోవాలంటున్న గంగవ్వ?

బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన తర్వాత ప్రముఖ యాంకర్ లాస్య బిగ్ బాస్ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్ ల ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులతో కలసి ఎంతో ఎంజాయ్ చేస్తూ వస్తున్నారు.ఈ క్రమంలోనే హారిక, అభిజిత్ కుటుంబ సభ్యులను కలుసుకున్నారు.

 Anchor Lasya Manjunath Meets Ganggavva At Lambadapally, Anchor Lasya, Gangavva,-TeluguStop.com

అంతేకాకుండా యూట్యూబ్ స్టార్ట్ అయిన గంగవ్వ ఇంటికి వెళ్లిన లాస్య, గంగవ్వతో ఎంతో సరదాగా గడిపి బిగ్ బాస్ హౌస్ విశేషాల గురించి మాట్లాడుకున్నారు.

ఈ సందర్భంలోనే గంగవ్వ మాట్లాడుతూ బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు లాస్య ఎక్కువ సేపు తనతో మాట్లాడేదని హౌస్ లో ఎప్పుడు తన కొడుకు జున్ను, తన భర్త, వాళ్ళ అమ్మ గురించి మాట్లాడుతూ వాళ్లను గుర్తు చేసుకుని లాస్య ఏడ్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయని తెలిపారు.

తనతో ఎప్పుడు ఎంతో ఆప్యాయంగా బిగ్ బాస్ హౌస్ లో ఉండేదని గంగవ్వ గుర్తు చేసుకున్నారు.

Telugu Anchor Lasya, Bb Telugu, Bigg Boss, Gangavva, Marriages-Movie

బిగ్ బాస్ హౌస్ గురించి లాస్య మాట్లాడుతూ, నేను ఎంత కష్టపడిన అదంతా జున్ను జీవితం బాగుండాలని, జున్ను మంచి చదువులు చదువుకోవాలని ఆశ పడటం తో ఎక్కువ కాలం బిగ్ బాస్ హౌస్ లో ఉండాలనుకున్నానని లాస్య తెలిపారు.అందుకు గంగవ్వ కలుగజేసుకొని నీ కొడుకు గురించి బాధ పడకు, మంచిగా ఉంటాడు, మంచిగా చదువుకుంటాడు, రెండు పెళ్లిళ్లు కూడా చేసుకుంటాడని ఎంతో సరదాగా చెప్పింది.

అందుకు లాస్య రెండు పెళ్లిళ్లు ఎందుకు అవ్వ… అని అంటే….

అందుకు గంగవ్వ ఈ రోజుల్లో రెండు పెళ్లిళ్లు చేసుకోవాలని సరదాగా కామెడీ చేశారు.ఇప్పుడు మా ఆయనకు నేనొక్కదానినే, నా కొడుక్కు కూడా ఒకరే చాలు అంటూ ఇద్దరూ ఎంతో సరదాగా మాట్లాడుకున్నారు.

అంతేకాకుండా లాస్య గంగవ్వ ఎంతో పవర్ ఫుల్ అని,తను హౌస్ లో ఉన్నప్పుడు ఎవరి పేరు చెప్తే వారు ఖచ్చితంగా ఎలిమినేట్ అయ్యే వాళ్లని,అలా ఇద్దరు ముగ్గురు గంగవ్వ చెప్పినట్టే ఎలిమినేట్ అయ్యారని గంగవ్వ గురించి తన భర్త మంజునాథ్ కి లాస్య తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube