మోనాల్ లవర్ ఎవరో చెప్పేసిన యాంకర్ లాస్య..?  

బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలేకు మరికొన్ని రోజులు మాత్రమే ఉన్న సంగతి తెలిసిందే.బిగ్ బాస్ గత సీజన్లలా ఈ సీజన్ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు.

TeluguStop.com - Anchor Lasya Interesting Comments About Monal Love Track

అయితే అభిజిత్ – మోనాల్ – అఖిల్ లవ్ ట్రాక్ వల్లే ప్రేక్షకుల్లో బిగ్ బాస్ షో పై అంతోఇంతో ఆసక్తి ఏర్పడింది.వీళ్ల ట్రయాంగిల్ లవ్ స్టోరీ గురించి సోషల్ మీడియాలో, వెబ్ మీడియాలో చాలా వార్తలు వచ్చాయి.

అయితే బిగ్ బాస్ షో నుంచి 11వ వారం ఎలిమినేట్ అయిన లాస్య బిగ్ బాస్ షోలో లవ్ ట్రాక్ ల గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

TeluguStop.com - మోనాల్ లవర్ ఎవరో చెప్పేసిన యాంకర్ లాస్య..-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

బయట ప్రచారం జరుగుతున్న విధంగా బిగ్ బాస్ షోలో లవ్ ట్రాకులు లేవని ఆమె అన్నారు.

బిగ్ బాస్ హౌస్ లో తాను కిచెన్ బాధ్యతలను తీసుకోవడం వల్ల అందరికీ తాను పెద్దావిడననే భావన కలిగిందని తాను వయస్సులో అంత పెద్దదాన్ని కాకపోయినా అందరూ అక్క అక్క అంటూ పిలిచారని అలా తాను వంటలక్కను అయ్యానని లాస్య తెలిపారు.మోనాల్ కు బిగ్ బాస్ హౌస్ లో లవర్ ఎవరూ లేరని.

అభిజిత్ మోనాల్ కు కేవలం ఫ్రెండ్ మాత్రమేనని లాస్య తెలిపారు.

మోనాల్ తో అభిజిత్ మొదట్లో పెద్దగా మాట్లాడేవాడు కాదని ఒకే హౌస్ లో మాట్లాడకపోతే బాగుండదని అభిజిత్ కు చెప్పడంతో అతను మోనాల్ తో మాట్లాడేవాడని అన్నారు.మోనాల్, అఖిల్ కూడా క్లోజ్ ఫ్రెండ్స్ అని అంతకు మించి వాళ్లిద్దరి మధ్య ఏం లేదని లాస్య చెప్పారు.బయట ట్రయాంగిల్ లవ్ స్టోరీ అని ప్రచారం జరుగుతున్నా బిగ్ బాస్ హౌస్ లో మాత్రం లవ్ ట్రాకులు ఏమీ లేవని అఖిల్ మోనాల్ లను తాను బెస్ట్ ఫ్రెండ్స్ గానే భావిస్తానని లాస్య వెల్లడించారు.

అఖిల్, మోనాల్ నోటి నుంచి లవ్ అనే పదం ఎప్పుడూ రాలేదని తెలిపారు.కొన్ని టాస్కులు తాను బాగా చేశానని కానీ ఆ కంటెంట్ ప్రసారం కాలేదని అన్నారు.

బిగ్ బాస్ హౌస్ లో మోనాల్ గురించి తనకు పెద్దగా తెలియదని అక్కడికి వెళ్లిన తరువాతే ఆమె హీరోయిన్ అని తెలిసిందని లాస్య వెల్లడించారు.మోనాల్ ను చాలామంది గ్లామర్ కోసం ఉంచుతున్నారని చెబుతున్నారని అయితే నిజంగా అందుకే ఉంచుతున్నారో లేదో తనకు తెలియదని లాస్య అన్నారు.

#Abhijith #Akhil #Lasya Comments #11thWeek

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Anchor Lasya Interesting Comments About Monal Love Track Related Telugu News,Photos/Pics,Images..