లాస్య కూడా పుకార్లే అనేసింది.. అంతా నో అంటే అసలు ఉండేది ఎవరు?  

Anchor Lasya Gives Clarity About She Is In Bigg Boss 3 Telugu-

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 3 మరో రెండు వారాల్లో ప్రారంభం కాబోతున్నట్లుగా విశ్వసనీయ సమాచారం ద్వారా తెలుస్తోంది.నాగార్జున హోస్ట్‌గా వ్యవహరించబోతున్న ఈ షోలో పార్టిసిపెంట్స్‌ గురించిన చర్చ పెద్ద ఎత్తున జరుగుతోంది.రేణుదేశాయ్‌, శ్రీముఖి, గుత్తా జ్వాలా, ఉదయభాను, లాస్య, వైవా హర్ష ఇంకా పలువురు ఈ షోలో పాల్గొనబోతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.

Anchor Lasya Gives Clarity About She Is In Bigg Boss 3 Telugu--Anchor Lasya Gives Clarity About She Is In Bigg Boss 3 Telugu-

అయితే వీరిలో రేణుదేశాయ్‌ ఇప్పటికే తాను బిగ్‌బాస్‌లో పాల్గొనడం లేదని క్లారిటీ ఇచ్చింది.ఇక గుత్తా జ్వాలా కూడా తాను బిగ్‌బాస్‌లోకి వెళ్లబోవడం లేదు అంటూ చెప్పేసింది.

Anchor Lasya Gives Clarity About She Is In Bigg Boss 3 Telugu--Anchor Lasya Gives Clarity About She Is In Bigg Boss 3 Telugu-

ఉదయభాను ఇప్పటి వరకు బిగ్‌బాస్‌ గురించి ఎలాంటి ప్రకటన చేయలేదు.ఆమెను సంప్రదించినా కూడా ఆసక్తి లేదన్నట్లుగా సమాధానం ఇచ్చింది.ఇక ఇదే సమయంలో బిగ్‌బాస్‌లో తాను కూడా పాల్గొనబోవడం లేదు అంటూ లాస్య క్లారిటీ ఇచ్చింది.ఇటీవలే బిడ్డకు జన్మనిచ్చిన లాస్య ప్రస్తుతం ఆ బిడ్డ ఆలన పాలన చూసుకుంటున్నట్లుగా చెప్పుకొచ్చింది.

బిగ్‌బాస్‌ మూడవ సీజన్‌లో లాస్య కనిపించడం లేదని క్లారిటీ వచ్చేసింది.వచ్చే సీజన్‌కు ఛాన్స్‌ ఉంటే తప్పకుండా చేస్తానంటూ తాజాగా పేర్కొంది.

లాస్య కూడా బిగ్‌బాస్‌ షోలో లేనంటూ చెప్పిన నేపథ్యంలో అసలు ఈ సీజన్‌లో ఉండేది ఎవరు, కనిపించేది ఎవరు అంటూ చర్చలు జరుగుతున్నాయి.రెండు ప్రోమోలు విడుదల చేసిన షో నిర్వాహకులు రేపు లేదా ఎల్లుండి నాగార్జున హోస్ట్‌ అంటూ అధికారికంగా ప్రకటించి ఆ తర్వాత రెండు వారాలకు షోను ప్రారంభించబోతున్నారు.ఇప్పటికే పార్టిసిపెంట్స్‌ ఎంపిక కార్యక్రమం ముగిసింది.కాని ఇప్పటి వరకు షో నిర్వాహకుల నుండి ఎలాంటి లీక్‌ మాత్రం లేదు.

దాంతో బిగ్‌బాస్‌ సీజన్‌ 3 పార్టిసిపెంట్స్‌ ఎంపిక విషయంలో క్లారిటీ షో ప్రారంభం అయిన తర్వాతే వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.