మగపిల్లాడికి జన్మనిచ్చిన ఒకప్పటి స్టార్ యాంకర్

బుల్లితెరపై ప్రముఖ యాంకర్‌గా, డీ డాన్స్ తో రవి, లాస్య జోడీగా భాగా ఫేమస్ అయ్యిన యాంకర్ లాస్య.తక్కువ టైంలో యాంకర్ తో టెలివిజన్ రంగంలో బెస్ట్ పొజిషన్ కి వెళ్ళిన లాస్య తర్వాత కో స్టార్ రవితో విభేదాల కారణంగా అతని జోడీ నుంచి బయటకి వచ్చి సోలోగా సక్సెస్ అయ్యే ప్రయత్నం చేసింది.

 Anchor Lasya Delivered Baby Boy-TeluguStop.com

అదే టైంలో తన బాయ్ ఫ్రెండ్ అయిన మంజునాథ్ ప్రేమ కథ పెళ్లి బంధంలోకి తీసుకొచ్చింది.ఇక తరువాత యాంకరింగ్ దూరం అయిన లాస్య భర్తతో కలిసి అమెరికాలో సెటిల్ అయ్యింది.

మళ్ళీ ఈ మధ్య కాలంలో లాస్య తన సొంత యుట్యూబ్ చానల్ తో ప్రేక్షకులని పలకరిస్తుంది.ఇదిలా ఉంటే ఆ మధ్య తాను గర్భవతి అని ఫోటోలు రిలీజ్ చేసిన లాస్య తాజాగా ఓ బిడ్దకి జన్మనిచ్చినట్లు తెలుస్తుంది.

సరిగ్గా ఉగాది నాడే పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది.ఈ మేరకు తన ఫేస్ బుక్ లో పోస్టు పెట్టింది.14 గంటల ప్రసవ వేదన అనంతరం బిడ్డను చూసుకున్నానంటూ లాస్య తన పోస్టులో పేర్కొంది.ఈ ఉగాది తమకు ఎంతో ప్రత్యేకమని వెల్లడించింది.

ఇక ఈ పోస్ట్ చూసి చాలా మంది లాస్య ఫ్యాన్స్ ఆమెకి విషెస్ చెబుతూ కామెంట్స్ పెడుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube