తండ్రిపై ప్రేమ.. కొత్త ఇల్లు కట్టిస్తున్న యాంకర్ లాస్య?

తెలుగు ప్రేక్షకులకు యాంకర్‌ లాస్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.కొద్దీ రోజుల కింది వరకు తన యాంకరింగ్‌ తో మాయ చేసి, ఎంతో మంది ప్రేక్షకుల మనసులలో స్థానం సంపాదించుకుంది.

 Anchor Lasya Constructing House Her Father Anchor Lasya, Constructing House, Fat-TeluguStop.com

తెలుగు బుల్లితెర పై ఎంతో మంది యాంకర్ లుగా రాణించారు.వారిలో లాస్య మంజునాథ్ కూడా ఒకరు.

యాంకర్ గా రాణిస్తున్న సమయంలోనే లాస్య పెళ్లిచేసుకుంది.పెళ్లి తర్వాత కూడా పలు షోలలో సందడి చేసిన లాస్య ఆ తర్వాత నిదానంగా యాంకరింగ్ కు దూరమయ్యింది.

అనంతరం నాగార్జున హోస్ట్ గా వ్యవహరించిన బిగ్ బాస్ సీజన్ 4లో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చింది లాస్య.

బిగ్ బాస్ హౌస్ లో తనదైన మాటలతో, అల్లరితో ఆకట్టుకుంది ఈ భామ.ఇదిలా ఉంటే మరొక సారి బుల్లితెరపై కి ఎంట్రీ ఇచ్చి సందడి సందడి చేస్తోంది.బుల్లితెరపై ప్రసారమయ్యే పలు షోలలో ఈవెంట్ లలో,స్కిట్ లలో నటిస్తూ ప్రేక్షకులకు మరొకసారి అలరిస్తోంది.

ఇక ప్రస్తుతం బోలెడు ఆఫర్లతో దూసుకుపోతూ తనకు సమయం దొరికినప్పుడల్లా యూట్యూబ్ లో వీడియోలు కూడా చేస్తోంది.లాస్య కేవలం యాంకరింగ్ తోనే కాకుండా చీమ ఏనుగు జోక్స్ తో కూడా బాగా పాపులర్ అయ్యింది.

తాజాగా ఆమె తన తండ్రికి సొంత ఇల్లు కట్టిస్తోంది అన్న ఈ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

అయితే ఇదే విషయాన్ని అభిమానులకు తెలపడానికి లాస్య ఒక వీడియో ని రిలీజ్ చేసింది.ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఈ వీడియోని చూసిన అభిమానులు లాస్య పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

అంతేకాకుండా ఇష్టంతో తన తండ్రికి కొత్త ఇల్లు కట్టిస్తున్నందుకు లాస్య ముఖం లో ఆనందం చూసి లాస్య అభిమానులు కూడా కృషి అవుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube