బిగ్ బాస్ ప్రేక్షకులకు శుభవార్త.. ఆ కంటెస్టెంట్ రీఎంట్రీ?  

anchor jordaar sujatha reentry in Bigg Boss show,Jordaar Sujatha, Bigg Boss House, Bigg Boss4, Nagarjuna, Re entry, Eliminated Contestants - Telugu Akkineni Nagarjuna, Akkineni Samantha, Anchor Jordaar Sujatha Reentry In Bigg Boss Show, Bigg Boss House, Bigg Boss Show, Bigg Boss4, Eliminated Contestants, Jordaar Sujatha, Nagarjuna, Re-entry

బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 4 స్టార్ మా ఛానల్ లో విజయవంతంగా ప్రసారమవుతున్న సంగతి తెలిసిందే.కంటెస్టెంట్ల ఎంపికలో కొన్ని లోపాలున్నా టాస్కులతో, లవ్ ట్రాకులతో బిగ్ బాస్ ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచుతున్నాడు.

TeluguStop.com - Anchor Jordar Sujatha Reentry In Bigg Boss Show

ఇప్పటికే బిగ్ బాస్ షోలోకి ముగ్గురు కంటెస్టెంట్లు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వగా ఈసారి బిగ్ బాస్ వైల్డ్ కార్డ్ ఎంట్రీకి బదులుగా ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ రీఎంట్రీ ఇచ్చేలా ప్లాన్ చేశాడు.
బిగ్ బాస్ షోలో ఇప్పటివరకు సూర్యకిరణ్, కరాటే కళ్యాణి, దేవి నాగవల్లి, స్వాతి దీక్షిత్, గంగవ్వ, జోర్దార్ సుజాత, కుమార్ సాయి ఎలిమినేట్ అయ్యారు.

వీరిలో దేవి నాగవల్లి, స్వాతి దీక్షిత్, కుమార్ సాయి ఎలిమినేషన్ లపై ప్రేక్షకుల నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమయ్యాయి.ప్రేక్షకుల అంచనాలను భిన్నంగా ఈ ముగ్గురు కంటెస్టెంట్లు ఎలిమినేట్ అయ్యారు.

TeluguStop.com - బిగ్ బాస్ ప్రేక్షకులకు శుభవార్త.. ఆ కంటెస్టెంట్ రీఎంట్రీ-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

బిగ్ బాస్ హౌస్ లోకి వీళ్లు రీఎంట్రీ ఇస్తే బాగుంటుందని అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.

అయితే బిగ్ బాస్ నిర్వాహకులు మాత్రం జోర్దార్ సుజాతను బిగ్ బాస్ హౌస్ లోకి మళ్లీ పంపే ప్రయత్నం చేస్తున్నారని తెలుస్తోంది.

నాగార్జునను బిట్టూ బిట్టూ అని పిలిచి ప్రేక్షకుల ఆగ్రహం వల్ల ఎలిమినేట్ అయిన సుజాతను మళ్లీ బిగ్ బాస్ హౌస్ లో ప్రవేశపెట్టడానికి బిగ్ బాస్ నిర్వాహకులు ఆమెను సంప్రదించారని సమాచారం.మరోసారి కరోనా పరీక్షలు నిర్వహించి నెగిటివ్ వస్తే ఆమెను బిగ్ బాస్ హౌస్ లోకి పంపనున్నారు.

వచ్చే వారం సుజాత హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని సమాచారం.మరోవైపు హోస్ట్ నాగార్జున వైల్డ్ డాగ్ సినిమా షూటింగ్ తో బిజీగా ఉండటంతో ఈ వారం అక్కినేని సమంత బిగ్ బాస్ షోను హోస్ట్ చేయనున్నారని తెలుస్తోంది.

నాగార్జున కోరికను మన్నించి సమంత బిగ్ బాస్ స్టేజ్ పై సందడి చేయడానికి అంగీకరించారని సమాచారం.

#Bigg Boss House #Jordaar Sujatha #Bigg Boss Show #Bigg Boss4 #Re-Entry

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Anchor Jordar Sujatha Reentry In Bigg Boss Show Related Telugu News,Photos/Pics,Images..