బేబీ బంప్ తో డ్యాన్స్ చేసిన హరితేజ.. ఫోటో వైరల్..!

తెలుగులోని ప్రముఖ ఛానెళ్లలో సీరియల్స్ లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు హరితేజ.అయితే సీరియల్స్ లో కంటే బిగ్ బాస్ సీజన్ 1లో పాల్గొనడం ద్వారా హరితేజకు మంచి పేరు వచ్చింది.

 Anchor Hariteja Baby Shower Cerenomy Photo Goes Viral In Social Media, Anchor Ha-TeluguStop.com

ఎన్టీఆర్ హోస్ట్ చేసిన బిగ్ బాస్ సీజన్ 1లో బుర్రకథలు చెప్పడం ద్వారా హరితేజ పాపులారిటీని సంపాదించుకున్నారు.బిగ్ బాస్ షో తరువాత హరితేజకు యాంకర్ గా కూడా వరుస అవకాశాలు వచ్చాయి.

నిన్న నటి హరితేజ సీమంతం వేడుక జరగగా ఆ వేడుకకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.హరితేజ సీమంతం వేడుకకు కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో పాటు బిగ్ బాస్ కంటెస్టెంట్ హిమజ కూడా హాజరయ్యారు.

చిలకపచ్చ రంగు చీరలో నగలు, ఇతర ఆభరణాలను ధరించి నవ్వుతూ హరితేజ ఎంతో ఆనందంగా ఈ వేడుకలో కనిపించారు.

Telugu Anchor Hariteja, Babyshower-Movie

బేబీ బంప్ తో హరితేజ డ్యాన్స్ చేయడం గమనార్హం.కొన్ని రోజుల క్రితం సోషల్ మీడియా వేదికగా గర్భవతి అయినట్లు ప్రకటించిన హరితేజ త్వరలో పండంటి బిడ్డకు జన్మనివ్వనున్నారు.బిగ్ బాస్ షో తర్వాత హరితేజకు సినిమాల్లో కూడా అవకాశాలు వస్తుండగా అడపాదడపా సినిమాల్లో నటిస్తూ తన నటనతో హరితేజ మెప్పిస్తున్నారు.

హరితేజ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా ఆమె అభిమానులు హరితేజకు అభినందనలు తెలుపుతున్నారు.

గర్భవతిగా ఉండటం వల్ల హరితేజ తాత్కాలికంగా సీరియళ్లు, షూటింగ్ లకు బ్రేక్ ఇచ్చారు.

బిగ్ బాస్ హౌస్ లో టాప్ 3 కంటెస్టెంట్ గా నిలిచిన హరితేజ త్రివిక్రమ్, అనిల్ రావిపూడి సినిమాల్లో ఈ మధ్య కాలంలో హరితేజ ఎక్కువగా నటించారు.అ ఆ, అరవింద సమేత, రాజా ది గ్రేట్, శ్రీనివాస కళ్యాణం, ప్రతిరోజు పండగే సినిమాలు హరితేజకు మంచి పేరు తెచ్చిపెట్టాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube